Begin typing your search above and press return to search.

2023 ని ఏ స్టార్ హీరో గ్రాండ్ గా ముగిస్తాడు?

ఈ నేప‌థ్యంలో సినీ ప్రియులు రాబోయే 40 రోజులలో రిలీజ్ చిత్రాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఆ చిత్రాలేంటి? అన్న‌ది ఓ సారి చూస్తే.

By:  Tupaki Desk   |   22 Nov 2023 2:30 AM GMT
2023 ని  ఏ స్టార్ హీరో గ్రాండ్ గా ముగిస్తాడు?
X

న‌వంబ‌ర్ ఎండింగ్ కి వ‌చ్చేస్తుంది. డిసెంబ‌ర్ మొద‌లైందంటే? 2024 లోకి కోంగ‌త్త‌గా అడుగు పెట్ట‌డానికి రెడీ అవ్వాల్సిందే. అంత‌కు ముందే గ్రాండ్ గా క్రిస్మ‌స్..న్యూఇయ‌ర్ వేడుక‌ల సెల‌బ్రేష‌న్ ఉంటుంది. ఈ సీజ‌న్ ని సినిమాలు ఎన్ క్యాష్ చేసుకునేవి. క్రిస్మ‌స్ కానుక‌గా భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుం టాయి. స‌క్స‌స్ అయితే సంక్రాంతి వ‌ర‌కూ థియేట‌ర్ల‌లో సంద‌డి ఆ చిత్రాల‌దే కొన‌సాగుతుంది.

ఈ నేప‌థ్యంలో సినీ ప్రియులు రాబోయే 40 రోజులలో రిలీజ్ చిత్రాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఆ చిత్రాలేంటి? అన్న‌ది ఓ సారి చూస్తే. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయకుడిగా న‌టించిన 'ఆదికేశ‌వ‌' ఈనెల 24 న రిలీజ్ అవుతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. మాస్ యాక్ష‌న్ తో పాటు హీరో-హీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు సినిమాకి హైప్ తీసుకొస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందా? అన్న ఉత్సాహం మెగా అభిమానుల్లో మొద‌లైపోయింది.

ఇదే రోజున 'కోట బొమ్మాళ్లి పీఎస్' రిలీజ్ అవుతుంది. మలయాళంలో హిట్ అయిన "నయట్టు"కి రీమేక్ రూపమిది. ఇందులో శివాని, శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ప్ర‌చార చిత్రాల‌కు బాగానే హైప్ తీసుకొచ్చాయి. ఇక డిసెంబ‌ర్ నుంచి అస‌లైన హ‌డావుడి మొద‌లవుతుంది. ర‌ణ‌బీర్ క‌పూర్ -సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ లో తెరకెక్కిన 'యానిమ‌ల్' భారీ అంచ‌నాల మ‌ధ్య డిసెంబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది.

'అర్జున్ రెడ్డి' త‌ర్వాత సందీప్ నుంచి వ‌స్తోన్న రెండ‌వ సినిమా కావ‌డంతో అంచ‌నాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తోన్న 'హాయ్ నాన్న' డిసెంబర్ 7 రిలీజ్ అవుతుంది. తండ్రి-కుమార్తె సెంటిమెంట్ బేస్ చేసుకుని తెర‌కెక్కి స్తోన్న చిత్ర‌మిది. ఇందులో మృణాల్ హీరోయిన్ కాగా...కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇక షారుక్ ఖాన్ క‌థానాయకుడిగా రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కిస్తోన్న 'డంకీ 'డిసెంబ‌ర్ 22న రిలీజ్ అవుతుంది.

షారుక్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌మ‌యంలో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. దీంతో డంకీ ఎలాంటి రికార్డులు నెల‌కొల్పుతుంది? అన్న అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతు న్నాయి. ఇదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్- షారుక్ ఖాన్ కి పోటీగా 'స‌లార్' తో దిగుతున్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ వాతావ‌ర‌ణం త‌ప్ప‌దు. వీటితో పాటు డిసెంబర్వ లో 'ఆపరేషన్ వాలెంటైన్'.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.