Begin typing your search above and press return to search.

2023 సెలబ్రిటీ వెడ్డింగ్ బెల్స్..!

2023 లో ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లి బాజాలు మోగాయి. కొన్నాళ్లుగా సహజీవనం లో ఉంటూ వచ్చిన వారు పెళ్లితో ఒకటైతే అభిరుచులు కలిసి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు కొందరు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:51 PM GMT
2023 సెలబ్రిటీ వెడ్డింగ్ బెల్స్..!
X

2023 లో ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెళ్లి బాజాలు మోగాయి. కొన్నాళ్లుగా సహజీవనం లో ఉంటూ వచ్చిన వారు పెళ్లితో ఒకటైతే అభిరుచులు కలిసి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు కొందరు. ఇలా 2023 లో సెలబ్రిటీ పెళ్లిళ్ల హంగామా వారి అభిమానులను ఉత్సాహపరిచాయి.

జనవరిలో ఒక్కటైన రాహుల్ అతియా శెట్టి :


బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూతురు హీరోయిన్ అతియా శెట్టి టీం ఇండియా బ్యాట్స్ మెన్ కే.ఎల్ రాహుల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఫైనల్ గా జనవరి 23న వీరు పెళ్లి చేసుకున్నారు. ముంబైలో ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫాం హౌస్ లోనే వీరి పెళ్లి జరిగింది.

ఫిబ్రవరిలో కియరా సిద్ధార్థ్ ల మ్యారేజ్ :


బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియరా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫైనల్ గా ఫిబ్రవరి 7న జైసల్మేర్ లోని రిసార్ట్ లో వీరి పెళ్లి జరిగింది. షేర్షా మూవీ టైం లో వీరి మధ్య ఏర్పడిన ఫ్రెండ్ షిప్ ప్రేమలో పడేలా చేసింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.

మంచువారబ్బాయి తో మౌనిక రెడ్డి పెళ్లి :


మంచు వారి హీరో మనోజ్ భూమా మౌనిక రెడ్డిని మార్చి 3న పెళ్లాడారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఫిల్మ్ నగర్ లోని మంచి లక్ష్మి ఇంట్లోనే తక్కువమంది సన్నిహితులతో వీరి పెళ్లి జరిగింది.

బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన శర్వానంద్ :


యువ హీరో శర్వానంద్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి రక్షితా రెడ్డిని పెళ్లాడారు. జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా వీరి మ్యారేజ్ జరిగింది. పెళ్లి తర్వాత రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ సినీ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు.

పరిణితి చోప్రా మెడలో మూడు ముళ్లు వేసిన రాఘవ్ చద్దా :


బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆం ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాని పెళ్లాడారు. ఎంగేజ్మెంట్ కి ముందే ఇద్దరు మీడియాకు కనిపించి వార్తల్లో నిలిచారు. సెప్టెంబర్ 24న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి మ్యారేజ్ వైభవంగా జరిగింది.

అందాల రాక్షిసిని పెళ్లాడిన మెగా హీరో :


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కొన్నేళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించారు. ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉంచిన వీరిద్దరు నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ఇటలీలో జరిగింది.

అమలా పాలు మరో జీవిత భాగస్వామి :


కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ తన ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని పెళ్లాడారు. నవంబర్ 5న వీరి పెళ్లి జరిగింది. డైరెక్టర్ విజయ్ కి డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్లు సినిమాలు చేసిన అమలా పాల్ ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకుంది.

రాధ కూతురు పెళ్లి సందడి :


సీనియర్ హీరోయిన్ రాధ కూతురు రంగం హీరోయిన్ కార్తీక రోహిత్ మీనన్ తో ఏడడుగులు వేశారు. నవంబర్ 19న తిరువనంతపురంలో కవడియార్ ఉదయపాలస్ కన్వెషన్ లో వీరి మ్యారేజ్ జరిగింది.

బుల్లితెర హీరో మానస్ ఇంటి వాడయ్యాడు :


స్మాల్ స్క్రీన్ పై నటించి మెప్పించిన మానస్ బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా చివరి వరకు ఉన్నాడు. సీరియల్ యాక్టర్ అయిన మానస్ అదే సీరియల్ యాక్ట్రెస్ శ్రీజని పెళ్లాడారు. నవంబర్ 23న వీరి పెళ్లి జరిగింది. విజయవాడ మురళి రిసార్ట్స్ లో వీరి మ్యారేజ్ ఘనంగా జరిగింది.

దగ్గుబాటి వారసుడి మ్యారేజ్ :


దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ప్రత్యూషని పెళ్లాడారు. అభిరాం పెళ్లి మ్యాటర్ చాలా సైలెంట్ గా కానిచ్చారు. మీడియాలో పెద్దగా హడావిడి చేయకుండానే అభిరామ్ పెళ్లి జరిగింది. డిసెంబర్ 7న శ్రీలంకలో అభిరాం, ప్రత్యూష మ్యారేజ్ జరిగింది.