Begin typing your search above and press return to search.

ట్రెండీ టీజ‌ర్‌: 12th Fail అయితే ఆత్మ‌హత్యేనా?

తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ప్రత్యేకంగా UPSC విద్యార్థులలో ఈ టీజ‌ర్ సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:49 PM GMT
ట్రెండీ టీజ‌ర్‌: 12th Fail అయితే ఆత్మ‌హత్యేనా?
X

12 ఫెయిలైతే ఆత్మ‌హ‌త్యేనా.. లైఫ్ ని రీస్టార్ట్ చేయాల‌ని చెబుతూ రూపొందిస్తున్న తాజా చిత్రం-12th Fail .విక్రాంత్ మాస్సే క‌థానాయ‌కుడు. విధు వినోద్ చోప్రా బ్యాన‌ర్ & ZEE స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ప్రత్యేకంగా UPSC విద్యార్థులలో ఈ టీజ‌ర్ సంచలనంగా మారింది. ఆకట్టుకునే కథనం స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్రలతో ఈ టీజ‌ర్ యువతను ఆకట్టుకుంది. నిజానికి ఇంట‌ర్ విద్యార్థుల‌కు కఠినమైన దినచర్యల నుండి బిగ్ రిలీఫ్ ని అందించే సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో భారీ స్క్రీన్‌పై UPSC విద్యార్థుల కోసం ప్రత్యేక టీజర్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయడంతో ఒక అంద‌మైన‌ ఆకర్షణీయమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భావి సివిల్ సర్వెంట్‌లు టీజర్‌లోని ప్రతి మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తూ.. ఇందులో స్పూర్తిదాయకమైన కంటెంట్ ను అందిస్తున్నందున ప్ర‌శంస‌లు కురిపించారు. UPSC విద్యార్థుల నుండి వచ్చిన ఈ రెస్పాన్స్ సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచుతోంది. ఇది భారీ విజ‌యానికి స‌హ‌క‌రిస్తుంద‌ని టీమ్ అంచ‌నా వేస్తోంది.

ప్రతి భారతీయుడిని ఆకట్టుకునే సినిమా ఇది. ఇంట‌ర్ విద్యార్థుల మాన‌సిక స్థితిని అద్దంప‌ట్టే విధంగా తీర్చిదిద్దారు. అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకం ఆధారంగా #ట్వ‌ల్త్ ఫెయిల్ మూవీని విధు వినోద్ చోప్రా తెర‌కెక్కించారు. నిజానికి ట్వ‌ల్త్ ఫెయిల్ .. జీవితాన్ని #పునఃప్రారంభించాలని కలలు కనే, శ్రమించే ధైర్యవంతులైన‌ మిలియన్ల మంది భారతీయుల స్ఫూర్తితో కూడిన శక్తివంతమైన నిజమైన కథ అని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. రియ‌ల్ లొకేష‌న్స్ రియ‌ల్ స్టూడెంట్స్ తో తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది. ఈ చిత్రం 27 అక్టోబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.