Begin typing your search above and press return to search.

హీరో కష్టాలు... అప్పుడు భార్య సంపాదనే ఆధారం

బాలీవుడ్ తో పాటు సౌత్ సినీ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా 12th ఫెయిల్ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 10:37 AM GMT
హీరో కష్టాలు... అప్పుడు భార్య సంపాదనే ఆధారం
X

బాలీవుడ్ తో పాటు సౌత్ సినీ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా 12th ఫెయిల్ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక సాధారణ కుర్రాడు, 12th ఫెయిల్‌ అయ్యి.. ఆ తర్వాత పట్టుదలతో చదివి, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరకు ఎలా దేశంలోని అత్యున్నత సర్వీస్ కు ఎదిగాడు అనేది 12th ఫెయిల్‌ మూవీ కథాంశం.


ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నటుడు విక్రాంత్ మస్సే కి మంచి గుర్తింపు లభించింది. సీరియల్స్ మరియు వెబ్‌ సిరీస్‌ లతో ఇప్పటికే నటుడిగా గుర్తింపు దక్కించుకున్న విక్రాంత్ ఇకపై హీరోగా బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సీరియల్స్‌ లో నటిస్తున్న సమయంలో మంచి సంపాదన వచ్చేది. కానీ తాను సీరియల్స్ వదిలేసి సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాను.

ఆ క్రమంలో సీరియల్స్ లేక, సినిమాల్లో నటించే అవకాశాలు లేకపోవడంతో కమర్షియల్‌ గా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పుడు నా భార్య దాదాపు అయిదు ఆరు నెలల పాటు నేను ఆడిషన్స్ కు వెళ్లేందుకు, ఇతర ఇంటి అవసరాల కోసం డబ్బు ఇచ్చేది. ఆ కాలంలో భార్య సంపాదనపైనే ఆధారపడి ఉన్నాను అంటూ విక్రాంత్ మస్సే అన్నాడు.

12th ఫెయిల్‌ మూవీ హిట్ తో కోట్ల పారితోషికం ఇచ్చి మరీ విక్రాంత్‌ మస్సే తో సినిమాలను చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. మన టైం రావాలి... అది వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అంటూ విక్రాంత్‌ మస్సే జీవితం నిరూపించింది. సినిమాలో మాదిరిగానే విక్రాంత్ నిజ జీవితంలో కూడా చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నమాట.