Begin typing your search above and press return to search.

నాన్న‌కు సిగ‌రెట్లు గురించి చెప్పి షాకిచ్చాడు!

కాలేజీలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. ఆ ల‌వ్ స్టోరీ కూడా సినిమా స్టైల్లోనే ఉంది. వెట్రీమార‌న్ భార్య ఆర్తి.

By:  Tupaki Desk   |   13 Jun 2025 9:45 AM IST
నాన్న‌కు సిగ‌రెట్లు గురించి చెప్పి షాకిచ్చాడు!
X

వెట్రీమార‌న్ కోలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్ట‌ర్. స్టార్ డైరెక్ట‌ర్ గా అత‌డికంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు భిన్నంగా ఆయ‌న సినిమాలుంటాయి. వెట్రీమార‌న్ తో సినిమా చేయ డానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని తార‌క్ ఓ సంద‌ర్భంలో ఓప‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. పోల్లాదావ‌న్ , ఆడుకుళం, విసుర‌నై, అసుర‌న్, వ‌డ‌చెన్నై, విడుద‌లై లాంటి హిట్ చిత్రాలు ఆయ‌నవే. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ గా పుల్ బిజీగా ఉన్నారు. వెట్రీ మార‌న్ ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తే ఆయ‌న‌ది ప్రేమ వివాహం.

కాలేజీలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. ఆ ల‌వ్ స్టోరీ కూడా సినిమా స్టైల్లోనే ఉంది. వెట్రీమార‌న్ భార్య ఆర్తి. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు క‌ల‌రు. అమ్మాయి పూన్‌త్రెం డల్, అబ్బాయి కదిరవన్. చెన్నై ల‌యోలా కాలేజీలో వెట్రీమార‌న్-ఆర్ది క‌లిసి చ‌దువుకున్నారు. స్నేహితులుగా ప‌రిచ‌య‌మై ప్రేమికు లుగా మారారు. అయితే ఆర్తి పెళ్లి చేసుకోమ‌ని అడిగితే అందుకు ప‌దేళ్లు ప‌డుతుంద‌ని వెట్రీమార‌న్ అన్నారుట‌.

తను సినిమాలు చేయాలని అనుకుంటున్నానని, సినిమాలు చేశాకే పెళ్లి చేసుకుంటానని అన్నారుట‌. అటుపై ఎనిమిదేళ్లకు పెళ్లి జ‌రిగిన‌ట్లు తెలిపారు. అయితే పెళ్లి విష‌యంలో ఆర్తి త‌ల్లిదండ్రులు ఒప్పుకుం టారా? లేదా? అనే టెన్ష‌న్ ఉండేదిట‌. అమ్మ‌నాన్న లు పాత‌కాల‌పు మ‌నుషులు కావ‌డంతో? ప్రేమ పెళ్లికి అంగీక‌రిస్తారా? అనే మీమాంస‌లోనే వెట్రీమార‌న్ ఆర్తి తండ్రి వ‌ద్ద‌కు వెళ్లి త‌న గురించిన నిజాల‌న్నీ చెప్పేసాడుట‌.

బాగా సిగరెట్లు తాగుతానని, సినిమా డైరెక్షన్ చేస్తానని, సినిమాల్లోనే ఉంటానని అన్నీ ఓపెన్ గా మాట్లా డేస‌రికి ఆర్తి తండ్రి ఆశ్చ‌ర్య‌పోయాడుట‌. ‘మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తే చాలు. మాకింకేమీ వద్దు’ అని చెప్పారుట‌. వెట్రీ మార‌న్ మాట‌ల‌కు ఆర్తి తండ్రి షాక్ అయినా? అత‌డిలో నిజాయితీ చూసి మ‌రో ఆలోచ‌న లేకుండా పెళ్లికి అంగీక‌రించార‌ని ఆర్తి తెలిపారు. వెట్లీ మార‌న్ పెద్ద డైరెక్ట‌ర్ గా కోట్లు సంపాది స్తున్నా తాను మాత్రం ఇంకా ఉద్యోగం చేస్తూ భ‌ర్త‌కు భారం కాకుండానే జీవిస్తున్న‌ట్లు ఆర్ది తెలిపారు.