Begin typing your search above and press return to search.

నితిన్ రాబిన్ హుడ్.. అంతా ఇక్కడేనా?

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే మనలో చాలామందికి నితినే గుర్తొస్తారు.

By:  Tupaki Desk   |   21 March 2024 9:16 AM GMT
నితిన్ రాబిన్ హుడ్.. అంతా ఇక్కడేనా?
X

టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే మనలో చాలామందికి నితినే గుర్తొస్తారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్.. ఏదైనా 100 శాతం ఎఫర్ట్ పెడతారు. అలాంటి నితిన్.. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల వక్కంతం వంశీ తో కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ గా వచ్చినా మంచి హిట్ కొట్టలేకపోయారు. దీంతో తనకు ఇప్పటికే హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములను నమ్ముకున్నారు నితిన్.

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఇప్పటికే భీష్మ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిపోయింది. వెంకీ కుడుములతో నితిన్ ఇప్పుడు రాబిన్ హుడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండు నెలల క్రితం, రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేశారు మేకర్స్.

సూపర్ హిట్ కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాక.. ఆ అంచనాలు మరింత పెరిగాయి. హ్యూమరస్ డైలాగ్‌ తో నితిన్‌ తనను తాను పరిచయం చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాబిన్ హుడ్ తరహాలోనే డబ్బున్న వాళ్ళ నుంచి సొమ్మును కాజేసే క్యారెక్టర్ లో నితిన్ సినిమాలో కనిపించనున్నారు.

అయితే గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్, విజువల్స్ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలా రోజుల పాటు గ్లింప్స్ ఫుల్ ట్రెండ్ అయింది. తాజాగా ఏయన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. రాబిన్ హుడ్ గ్లింప్స్.. బిహైండ్ ద సీన్స్ వీడియోను షేర్ చేసింది. రియాలిటీగా చూపించేందుకు మేకర్స్ ఎంత కష్టపడ్డారో వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియో చూశాక ఇదంతా సెట్స్ లోనే షూట్ అయిందా, షాకింగ్ గా ఉందే అని కచ్చితంగా అనిపిస్తోంది.

ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇచ్చేందుకు చాలా రియలిస్టిక్ గా షూట్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వర్చువల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరోవైపు, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. నితిన్ కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.