నాని హిట్ 3 ఓవర్సీస్ రికార్డులు..!
న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ఓవర్సీస్ లో దుమ్ము దులిపేస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫ్రాంచై జీ లో భాగంగా వచ్చిన హిట్ 3 నాని కెరీర్ బెస్ట్ వసూళ్లతో దూసుకెళ్తుంది.
By: Tupaki Desk | 5 May 2025 6:15 PMన్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ఓవర్సీస్ లో దుమ్ము దులిపేస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫ్రాంచై జీ లో భాగంగా వచ్చిన హిట్ 3 నాని కెరీర్ బెస్ట్ వసూళ్లతో దూసుకెళ్తుంది. నాని ఇప్పటివరకు ఈ రేంజ్ మాస్ విధ్వంసం చూపించింది లేదు. దసరా లో మాస్ రోల్ చేసినా కూడా రక్తపాతం తక్కువే. కానీ హిట్ 3 లో అర్జున్ సర్కార్ నెక్స్ట్ లెవెల్ అనిపించాడు.
తెలుగు రెండు రాష్టాల్లో కాదు నాని హిట్ 3 ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదరగొడుతుంది. రిలీజ్ కి ముందు నుంచే హిట్ 3 సినిమాకు ఓవర్సీస్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇక సినిమా కూడా అంచనాలకు మించి ఉండడంతో భారీ వసూళ్లు రాబడుతుంది.
హిట్ 3 సినిమా ఓవర్సీస్ లో 2.3 మిలియన్స్ బిజినెస్ చేసింది. 2.4 మిలియన్ డాలర్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే.. అయితే ఇప్పటికే సినిమా కు 2.60 మిలియన్ డాలర్స్ వచ్చాయి. నాని హిట్ 3 నార్త్ అమెరికా లో 2.03 మిలియన్ డాలర్స్, ఆస్ట్రే లియా లో 155000 డాలర్స్, యూకే, ఐర్ ల్యాండ్ లో 20000 డాలర్స్, న్యూజిలాండ్ లో 12000 డాలర్స్, మిడిల్ ఈస్ట్ లో 110000 డాలర్స్, మిగతా ఏరియాల్లో 90000 డాలర్స్ వసూళ్లు రాబట్టింది.
హిట్ 3 కి ఓవర్సీస్ ఈ రేంజ్ రెస్పాన్స్ అసలు ఊహించలేదు. సినిమా సినిమాకు నాని తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. కంటెంట్ ఉన్న సినిమా తీస్తే పక్కా బొమ్మ హిట్టే అని హిట్ 3 తో మరోసారి ప్రూవ్ చేశాడు నాని. శైలేష్ హిట్ యూనివర్స్ లో కూడా హిట్ 3 కమర్షియల్ గా కూడా సెన్సేషన్ అనిపించుకుంది.
హిట్ 3 వీకెండ్ రిపోర్ట్ ఇలా ఉంటే సినిమా ఫుల్ రన్ లో తప్పకుండా ఇంకొన్ని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టేలా ఉంది. హిట్ 3 లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా నానితో అమ్మడి స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. సినిమా మొత్తం నాని తన భుజాన వేసుకుని నడిపించాడు. నాని హిట్ 3 తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే