Begin typing your search above and press return to search.

చదువు కోసం అమెరికా వెళ్లే వారిలో మనోళ్లు అంతమందా?

2023-24లో రికార్డుస్థాయిలో మన దేశం నుంచి అమెరికాకు వెళ్లి వారు ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన గణాంకాలు తాజాగా వెలువడ్డాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:29 AM GMT
చదువు కోసం అమెరికా వెళ్లే వారిలో మనోళ్లు అంతమందా?
X

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాల్ని చూస్తే అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. కారణం.. అమెరికాకు చదువు కోసం వెళ్లే వారిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారత విద్యార్థుల సంఖ్య ఏకంగా 26 శాతం ఉండటం విశేషం. 2023-24లో రికార్డుస్థాయిలో మన దేశం నుంచి అమెరికాకు వెళ్లి వారు ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన గణాంకాలు తాజాగా వెలువడ్డాయి.

గత విద్యా సంవత్సరంలో మన దేశం నుంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య అక్షరాల 2,68,923. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాకు చదువుకోవటానికి వెళ్లిన వారి సంఖ్య దాదాపు పది లక్షల మంది వరకు ఉంటుందని చెబుతున్నారు. తాజాగా వెల్లడైన ఓపెన్ డోర్స్ నివేదికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంటే.. అన్ని దేశాలతో కలిపి చూస్తే.. అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో 26 శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం.

తాజా గణాంకాల్ని చూస్తే.. కరోనాకు ముందు అమెరికాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల గణాంకాలకు చేరుకున్నట్లుగా చెప్పాలి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా వర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది. గడిచిన 40 ఏళ్లలో ఇదే గరిష్ఠమని చెబుతున్నారు. అమెరికా వర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల్లో ప్రధమ స్థానం చైనాది. 2022-23 విద్యా సంవత్సరంలో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లగా.. తర్వాతి స్థానంలో భారత్ కు చెందిన విద్యార్థులు 2.68 లక్షల మంది ఉన్నారు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారి చైనాను భారత్ అధిగమించటం విశేషం. భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనానుంచి గడిచిన మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. చైనా.. భారత్ తర్వాత చూస్తే దక్షిణ కొరియా.. కెనడా.. వియత్నాం.. తైవాన్..నైజీరియాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో విద్యార్థుల ఎక్కువగా సైన్స్.. టెక్నాలజీ.. బిజినెస్ విభాగాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంలో 21 శాతం పెరుగుదల కనిపించటం గమనార్హం. మ్యాథ్స్.. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్.. బిజినెస్ విభాగాలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.