Begin typing your search above and press return to search.

షాకింగ్: 8000 మంది ఐఐటీ విద్యార్థులు డ్రాప్ అవుట్!

గత ఐదేళ్లలో డ్రాప్‌ ఔట్లుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి సుభాస్‌ సర్కార్‌ రాజ్యసభలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   28 July 2023 12:47 PM GMT
షాకింగ్: 8000 మంది ఐఐటీ విద్యార్థులు డ్రాప్  అవుట్!
X

భారతీయ విద్యా వ్యవస్థ విషయానికి వస్తే.. ఐఐటీ ఇంజనీరింగ్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశం మాత్రమే కాదు, దేశం లోని అత్యంత ప్రసిద్ధ, గౌరవనీయమైన సంస్థల లో ఒకటి. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో కూడా డ్రాప్ అవుట్ లు చాలా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

అవును... ప్రతి ఏటా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చేరాల ని కలలు కంటుంటారు. అయితే దేశం లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుతోన్న దాదాపు 8 వేల మంది ఐఐటీ విద్యార్ధులు గత ఐదేళ్లలో డ్రాప్‌ ఔట్లుగా ఉన్నట్లు కేంద్ర మంత్రి సుభాస్‌ సర్కార్‌ రాజ్యసభలో వెల్లడించారు.

అయితే వీటి లో సీటు సంపాధించడం కోసం విపరీతంగా కృషి చేసి.. అనంతరం సీటు సంపాదించిన తర్వాత కొందరు విద్యార్ధులు మాత్రం మధ్యలోనే చదువు మానేస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా 2019 నుంచి 2023 మధ్య కాలం లో దేశ వ్యాప్తంగా దాదాపు 8 వేల మందికిపైగా ఐఐటీ విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారని మంత్రి తెలిపారు.

బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా... విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, పీ.హెచ్‌.డీ కోర్సుల్లో అత్యధిక సంఖ్యలో డ్రాపవుట్స్ ఉన్నారని ఆయన చెప్పారు.

ఇది కేవలం ఐఐటీలకే పరిమితం కాలేదు! సెంట్రల్ యూనివర్సిటీలో అత్యధిక సంఖ్య (17,454)ల్లో డ్రాపౌట్స్‌ ఉన్నట్లు మంత్రి తెలిపారు. తర్వాత ఐఐటీలు, ఆ తర్వాత ఐఐటీల్లో 8,139 మంది, ఎన్‌.ఐ.టీ.ల్లో 5,623 మంది, ఐ.ఐ.ఎస్‌.ఈ.ఆర్‌.ల్లో 1,046 మంది, ఐ.ఐ.ఎం.ల్లో 858 మంది, ట్రిపుల్‌ ఐటీల్లో 803 మంది చదువును మధ్యలో ఆపేశారని తెలిపారు.

ఇదే సమయం లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2018 నుంచి 39 మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వీరి లో ఎయిమ్స్‌ క్యాంపస్‌ లలో ఏడు మంది విద్యార్ధులు ప్రాణాలు తీసుకున్నారు. 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 98 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.

అయితే తీవ్రమైన మనసిక ఒత్తిడి.. వ్యక్తిగత, వైద్యపరమైన కారణాల వల్ల వారంతా చదువు మధ్యలోనే మానేస్తున్నట్లు మంత్రి తెలిపారు.