Begin typing your search above and press return to search.

దేశంలో 20 ఫేక్ వర్సిటీల తాజా లిస్టు ఇదే

దేశం లో దొంగ వర్సిటీల కు సంబంధించిన ఒక జాబితాను విడుదల చేసింది. ఈ దొంగ వర్సిటీల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానం లో నిలిచింది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 3:58 AM GMT
దేశంలో 20 ఫేక్ వర్సిటీల తాజా లిస్టు ఇదే
X

విద్య వ్యాపారంగా మారిన తర్వాత.. తప్పుడు మార్గాల్లో ఆదాయాన్ని సంపాదించుకునేందుకు వీలుగా కొన్ని తప్పుడు విద్యాసంస్థల్ని నెలకొల్పటం.. ప్రజల అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని మోసం చేయటం అలవాటుగా మారింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రంగం లోకి దిగింది. దేశం లో దొంగ వర్సిటీల కు సంబంధించిన ఒక జాబితాను విడుదల చేసింది. ఈ దొంగ వర్సిటీల్లో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానం లో నిలిచింది.

మొత్తం 20 నకిలీ వర్సిటీల్లో ఎనిమిది ఢిల్లీకి చెందినవి కాగా.. ఉత్తరప్రదేశ్ లో నాలుగు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ లో రెండింటిని ప్రకటించగా.. తెలంగాణ లో ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం. దొంగ వర్సిటీల్లో టాప్ ఢిల్లీ కాగా.. తర్వాతి స్థానాల్లో యూపీ నిలిచింది. ఈ వర్సిటీలకు డిగ్రీల ను ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వర్సిటీలు ప్రదానం చేసే డిగ్రీల ను ఉన్నత విద్య.. ఉద్యోగాల కు పరిగణ లోకి తీసుకోమని తేల్చింది.

తాజాగా విడుదల చేసిన ఇరవై వర్సిటీల కు సంబంధించి.. వారు జారీ చేసిన డిగ్రీలు చెల్లుబాటు కావని.. అసలు వాటికి డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని పేర్కొంది. ఇంతకీ ఆ 20 నకిలీ వర్సిటీలు ఏమిటి? వాటి పేర్లే ఏమిటి? రాష్ట్రాల వారీగా చూస్తే.. మొత్తం 20 వర్సిటీల్లో ఢిల్లీలో ఉన్న 8 నకిలీ వర్సిటీలు ఇవే.

1. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్

2. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్

3. యునైటెడ్ నేషన్స్ వర్సిటీ

4. వొకేషనల్ వర్సిటీ

5. ఏడీఆర్ - సెంట్రిక్ జ్యూరిడికల్ వర్సిటీ

6. ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్

7. విశ్వకర్మ ఓపెన్ వర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్

8. ఆధ్యాత్మిక్ వర్సిటీ

ఉత్తరప్రదేశ్ లో ఉన్న నాలుగింటిని చూస్తే..

1. గాంధీ హిందీ విద్యాపీఠ్

2. నేషనల్ వర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి

3. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ వర్సిటీ

4. భారతీయ శిక్షా పరిషత్

పశ్చిమ బెంగాల్

1. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్

2. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

ఏపీ

1. క్రైస్టై న్యూ టెస్ట్ మెంట్ డీమ్డ్ వర్సిటీ (గుంటూరు)

2. బైబిల్ ఓపెన్ వర్సిటీ ఆఫ్ ఇండియా (విశాఖపట్నం)

ఇతర రాష్ట్రాల్లో నాలుగు ఫేక్ వర్సిటీలు ఉన్నాయి. వాటిల్లోకి వెళితే..

1. బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)

2. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్చేరి)

3. సెయింట్స్ జాన్స్ వర్సిటీ (కేరళ)

4. రాజా అరబిక్ వర్సిటీ (మహారాష్ట్ర)