Begin typing your search above and press return to search.

దీపావళి రోజే రూ.1.5 కోట్ల లాటరీ.. ఇంట్లో ఆడబిడ్డ జననం!

పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన హర్మన్ కౌర్ కుటుంబానికి దీపావళి డబుల్ ధమాకా ఇచ్చింది. రూ.200తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.1.5 కోట్ల మొదటి బహుమతి వచ్చింది. అదే రోజు కుటుంబంలో ఆడబిడ్డ జన్మించింది. అయితే పాప ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Nov 2026 10:06 AM IST
దీపావళి రోజే రూ.1.5 కోట్ల లాటరీ.. ఇంట్లో ఆడబిడ్డ జననం!
X

పంజాబ్‌లోని ఓ కుటుంబానికి ఈ దీపావళి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మారింది. ఒకే రోజు రెండు శుభవార్తలు ఆ ఇంట్లో ఆనందాన్ని నింపాయి. రూ.200 పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.1.5 కోట్ల మొదటి బహుమతి రావడంతో పాటు అదే రోజు కుటుంబంలో ఆడబిడ్డ జన్మించింది.

మాన్సా జిల్లాలోని సైదేవాలా గ్రామానికి చెందిన హర్మన్ కౌర్ పేరుతో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. భీఖీ రోడ్డులో ధన్నా సింగ్ నిర్వహిస్తున్న లాటరీ స్టాల్‌లో ఈ టికెట్ తీసుకున్నట్లు నిర్వాహకుడు వెల్లడించారు. నెలవారీ లాటరీ ఫలితాల్లో ఈ టికెట్‌కు మొదటి బహుమతి దక్కింది.

అయితే ఈ ఆనంద సమయంలో కుటుంబానికి చిన్న ఆందోళన కూడా ఎదురైంది. పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు దృష్టి పెట్టారు.

లాటరీ గెలిచిన కుటుంబాన్ని తమ స్టాల్‌కు ఆహ్వానించి సత్కరిస్తామని నిర్వాహకుడు ధన్నా సింగ్ తెలిపారు. అదృష్టం రూపంలో కోట్ల రూపాయల బహుమతి, ఇంట్లోకి కొత్త సభ్యురాలి రాక.. ఈ కుటుంబానికి ఈ దీపావళి నిజంగానే ప్రత్యేకంగా నిలిచిపోయింది.