జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!
By: Tupaki Desk | 20 Nov 2026 10:37 AM ISTకేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్ ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. నిత్యం సుమారు 2,500 మంది వచ్చే ఈ ప్రాంతానికి ప్రస్తుతం రోజుకు 7 వేల మంది వరకు వస్తున్నారు. 'రామాయణ' సినిమా విడుదల తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
2018లోనే ఈ భారీ జటాయు శిల్పం నిర్మాణం పూర్తయింది. ఇన్నాళ్లూ కేరళకు వెళ్లే పర్యాటకుల్లో చాలామందికి మాత్రమే తెలిసిన ఈ ప్రదేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. అయితే సందర్శకుల సంఖ్య పెరగడం వల్ల నిర్వహణపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రోజుకు 7 వేల నుంచి 10 వేల మందికి మాత్రమే ప్రవేశం కల్పించే సామర్థ్యం అక్కడ ఉంది. ప్రస్తుతం వస్తున్న రద్దీ ఆ పరిమితికి దగ్గరగా ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జటాయు కేంద్రంపై దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపీ వెల్లడించారు. పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని రాకకు ముందే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఇప్పటికే రోజుకు వేల మంది వస్తుండటంతో, రాబోయే రోజుల్లో రద్దీని ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
