Begin typing your search above and press return to search.

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు!

తన ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని కేరళ సీఎం వి.డి. సతీశన్ అన్నారు. తన సంభాషణలు వింటున్నవారిని తప్పుదారి పట్టించేందుకు ఫోన్‌లో అప్పుడప్పుడు కావాలనే అబద్ధాలు చెబుతానని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఏఐతో వ్యక్తుల ప్రవర్తనను గమనిస్తూ కొనుగోలు నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2026 10:51 AM IST
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు!
X

తన ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని కేరళ సీఎం వి.డి. సతీశన్ అన్నారు. తనపై నిఘా ఉందని, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కావాలనే అబద్ధాలు చెబుతానని తెలిపారు. తన సంభాషణలు వింటున్నవారిని తప్పుదారి పట్టించేందుకే అలా చేస్తానని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తన కాలేజీ రోజుల నాటి ఓ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు సతీశన్. అప్పట్లో జార్జ్ ఆర్వెల్ రాసిన '1984' నవల చదివానని చెప్పారు. ప్రతి ఒక్కరినీ నిరంతరం గమనించే సమాజం గురించి అందులో ఉంటుందని, ఆ పుస్తకం చదివిన తర్వాత నెల రోజుల పాటు భయంతో గడిపానని తెలిపారు.

ప్రస్తుతం ఏఐ వినియోగం పెరుగుతున్న తీరుపైనా ఆయన మాట్లాడారు. మనుషులు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటును క్రమంగా కోల్పోతున్నారని అన్నారు.

షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు, ఏఐ వ్యవస్థలు అక్కడికి వచ్చే కస్టమర్ల కదలికలను గమనిస్తున్నాయని చెప్పారు. వారి ప్రవర్తన, ఆసక్తులను బట్టి ప్రకటనలు చూపిస్తున్నారని, చివరకు ఏ వస్తువు కొనాలన్న నిర్ణయాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.

అయితే తన ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సతీశన్ బయటపెట్టలేదు.