అమెరికాలో తెలుగు కీచకుడికి 20 ఏళ్ల జైలు
ఉద్యోగరీత్యా, బతుకుతెరువు కోసం అమెరికా వెళ్లిన వారు అక్కడ కేసుల్లో చిక్కుకుని చివరికి అక్కడి జైల్లో చనిపోతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తూ ఉన్నాం.
By: Tupaki Desk | 24 April 2026 4:15 PM ISTఉద్యోగరీత్యా, బతుకుతెరువు కోసం అమెరికా వెళ్లిన వారు అక్కడ కేసుల్లో చిక్కుకుని చివరికి అక్కడి జైల్లో చనిపోతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తూ ఉన్నాం. అమెరికన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడి న్యాయ వ్యవస్థలో కేసులు త్వరితగతిన పరిస్కారం అవుతూ దోషులకు శిక్ష పడుతూ ఉంటాయి. అమెరికాలో చిన్న కేసులకు పెద్ద శిక్షలు ఉంటాయి అంటారు. అయినా కూడా అక్కడ ఉన్న విదేశీయులు వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కుకుంటూ, అమెరికన్ జైల్లో పడి చనిపోతున్నారు. అమెరికాలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న ఫణి తాళ్లూరి అనే వ్యక్తికి స్థానిక కోర్ట్ ఏకంగా 25 ఏళ్లు జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. ఆయన వయసు రీత్యా, ఇతర కారణాల వల్ల ఆయనకు విధించిన శిక్షను 25 నుంచి 20 ఏళ్లకు తగ్గించినట్లు కోర్ట్ పేర్కొంది.
ఫణి తాళ్లూరికి శిక్ష...
తెలుగు వ్యక్తి అయిన ఫణి తాళ్లూరి గురించి గత రెండు సంవత్సరాలుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. లైంగిక వేదింపుల కేసులో ఫణి ని అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి ఫణి పాల్పడినట్లుగా కేసు నమోదు అయ్యింది. అమెరికన్ పోలీసులు సుదీర్ఘ విచారణ తర్వాత అతడు కేవలం ఆ ఒక్క అమ్మాయిపైనే కాకుండా పదుల సంఖ్యలో మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని, అంతే కాకుండా పదుల సంఖ్యలో అమ్మాయిలను లైంగికంగా వేధించాడని నిరూపించారు. 52 ఏళ్ల ఫణీ గత పదేళ్లుగా చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. దాంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికన్ ప్రాసిక్యూషన్ కోర్ట్‌లో సాక్ష్యాలతో సహా వాధించడంతో అతడికి కఠిన శిక్ష విధిస్తూ కోర్ట్ తుది తీర్పును ఇవ్వడం జరిగింది.
అమెరికాలో తెలుగు వ్యక్తికి శిక్ష...
వర్జీనియా కోర్ట్ తీర్పు అనుసారం భారత సంతతికి చెందిన ఫణీ తాళ్లూరి మైనర్‌లను లైంగికంగా వేధించినట్లుగా నిరూపితం అయ్యింది. అంతే కాకుండా వారిని డిజిటల్‌గా వేధించాడు. సోషల్ మీడియాను ఉపయోగించి చిన్న పిల్లలను తీవ్రంగా క్షోభకు గురి చేశాడని కోర్ట్ పేర్కొంది. పదుల సంఖ్యలో సాక్ష్యాలు ఫణీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మైనర్ బాలికలు స్వయంగా కోర్ట్ ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులకు సంబంధించిన విషయాలను తెలియజేయడంతో కేసు మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. కేసులో ఫణీకి 25 ఏళ్లు జైలు శిక్ష పడటంలో కీలకంగా రెండు సాక్ష్యాలు నిలిచాయి. అందులో ఒక బాలిక తనను పలు సార్లు అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపించాలని ఒత్తిడి చేశాడంటూ సాక్ష్యం చెప్పింది. మరో బాలిక తనపై పదుల సంఖ్యలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లు చెప్పింది.
కోర్ట్ ఆయన వాదన వినలేదు
ఫణీ తనను తాను మానసిక వికలాంగుడిగా నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడంతో పాటు, పెరిగిన వాతావరణం, పుట్టిన వాతావరణం నేపథ్యంలో తాను ఇలా మారినట్టు చెప్పాడు. మధ్యం కు బానిస కావడం వల్ల తాను తప్పు చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన తప్పులను తెలుసుకున్నాను అని, మధ్యం కు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్లుగా చెప్పాడు. ఈ కారణాలన్నింటి ని చూపించి ఫణీ తనకు పడ్డ శిక్షను అయిదు సంవత్సరాలకు తగ్గించుకోవాలని చూశాడు. కానీ కోర్ట్ ఆయన వాదన వినలేదు. ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పూర్తి స్పృహతోనే ఫణీ ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా కోర్ట్ భావించింది. అందుకే అయిదు ఏళ్ళు తగ్గించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
