Begin typing your search above and press return to search.

విషాధాంతం.. అన్నిరకాలుగానూ వాడుకుని క్లైమాక్స్ లో కట్ చెప్పాడు!

అయితే క్లైమాక్స్ లో నువ్వు లేని జీవితం వద్దు అంటూ యువతి ఆత్మహత్య చేసుకుంది

By:  Tupaki Desk   |   28 July 2023 5:11 AM GMT
విషాధాంతం.. అన్నిరకాలుగానూ వాడుకుని క్లైమాక్స్ లో కట్ చెప్పాడు!
X

ప్రస్తుతం ఎక్కువగా ఆన్ లైన్ ప్రేమలు, సోషల్ మీడియా మోహాలూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగ మోసలు కూడా పెరిగిపోతున్నాయి. పైగా ఎవరు ఏమిటో తెలుసుకునే ఛాన్స్ లేకుండా కేవలం టైంపింగ్ లో కనిపించే అక్షారాలతోనే ఒక నమ్మకాన్ని ఏర్పరచేసుకుంటున్న జనం ఉన్నరోజులివి!

ఈ క్రమంలో... సోషల్ మీడియా పరిచయంవల్ల ఆకతాయిలు కాదు.. ఉద్యోగం చేసుకుంటూ గౌరవమైన సంపాదనతో ఉన్న యువతులు కూడా మాయమాటలకు మోసపోతున్నారు. ఇది మోసపోతోన్న వారి అమాయకాత్వమా.. లేక, మోసం చేస్తోన్నవారి గొప్పతనమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇలా మోసపోయేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.

ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ యువతితో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన కర్ణాటకలోని మండ్యకు చెందిన ఓ యువకుడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే క్లైమాక్స్ లో నువ్వు లేని జీవితం వద్దు అంటూ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ గ్యాప్ లో ఏమి జరిగింది.. ఆ యువతి ఆ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు నగరానికి చందిన యువతి విద్యాశ్రీ... ఎంసీఏ చదివి ఒక కంపెనీలో పనిచేస్తోంది. ఇదే సమయంలో మోడలింగ్ కూడా ఆమె ప్రవృత్తి. ఈ సమయంలో బసవేశ్వరనగరలో ఒక జిమ్‌ లో ట్రైనర్ గా పనిచేస్తున్న అక్షయ్‌ అనే వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అతి తక్కువ రోజుల్లోనే ఆ ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.

ఈ సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అక్షయ్‌... ఆమె నుంచి రూ.లక్షల కొద్దీ నగదు తీసుకున్నాడు. అయితే అందుకు ఆమె ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అంతా అక్షయ్‌ కోసమే అన్నట్లు ఆమె జీవితం అంకితం చేసింది. ఈ సమయంలో ఒకరోజు ఇద్దరిమధ్యా పెళ్లి టాపిక్ వచ్చింది. దీంతో అప్పుడే కాదు అంటూ ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడు అక్షయ్.

ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు జరుగుతుండటంతో ఆమె ఒకానొక సమయంలో మరింత పట్టుబట్టింది. దీంతో... ప్రియుడు అక్షయ్... నిన్ను పెళ్లి చేసుకోలేనని అతని ప్రియురాలు విద్యాశ్రీకి చెప్పాడు. మూడేళ్లు ఎంజాయ్ చేసిన తరువాత ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతిపై పిడుగు పడినట్లు అయ్యింది.

ఈ విషాదాన్ని దిగమింకలేక జూన్‌ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో.. "నేను అక్షయ్‌ ను ఎంతగానో నమ్మాను.. నా జీవితాన్నే ఆయనకు ధారపోశాను.. ప్రేమను నమ్మి నేను నిండా మునిగాను.. అందుకే ఇక తనువు చాలిస్తున్నాను.. మీరెవ్వరూ.. ప్రేమంటూ వెంటపడితే ఎవరనీ నమ్మొద్దు" అంటూ ఆమె రాసినట్లు చెబుతున్న లేఖ వెలుగు చూడటంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

ఆ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఈ మేరకు అక్షయ్‌ ను అరెస్టు చేశామని డీసీపీ శివప్రసాద్‌ దేవరాజు ధ్రువీకరించారు!