Begin typing your search above and press return to search.

ఉద్యోగం పేరుతో 20 మందిపై ఇద్దరు సామూహిక అత్యాచారం

అంతేకాదు.. ఆ దారుణాలను వీడియోలు తీసి వాటిని చూపించి..తాము చేసిన పనుల్ని బయటకు చెప్పకూడదని బెదిరించారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:30 AM GMT
ఉద్యోగం పేరుతో 20 మందిపై ఇద్దరు సామూహిక అత్యాచారం
X

రాజస్థాన్ లో దారుణ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. విన్నంతనే విస్మయానికి గురి చేసే ఈ వ్యవహారంలో ఇద్దరు రాజకీయ నేతల ప్రమేయం ఉండటం.. బాధితులుగా 20 మంది మహిళలు ఉండటం షాక్ కు గురి చేస్తోంది. వీరందరికి అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. వారి వేధింపులు భరించలేని ఒక మహిళ తిరగబడి.. ధైర్యం చేసి బయటకు రావటంతో వారి నీచమైన పనులు బయటకు వచ్చాయి.

రాజస్థాన్ లోని సిరోహీ మున్సిపల్ ఛైర్ పర్సన్ మహేంద్రా.. మాజీ మున్సిపల్ కమిషనర్ మహేంద్ర చౌధరిలు కొందరు మహిళలకు అంగన్ వాడీ కార్యకర్తలుగా ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు. వారికి ఆశ్రయం ఇచ్చి వసతులు కల్పించారు. ఈ క్రమంలో వారికి మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చి.. వారు స్ప్రహలో లేనప్పుడు వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు.

అంతేకాదు.. ఆ దారుణాలను వీడియోలు తీసి వాటిని చూపించి..తాము చేసిన పనుల్ని బయటకు చెప్పకూడదని బెదిరించారు. అంతేకాదు.. వారి నుంచి లక్షలాది రూపాయిలు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేసేవారు. వీటిని భరించలేని ఒక బాధితురాలు తిరగబడి.. మరికొందరు మహిళలతో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే.. నిందితులు రాజకీయ నేపథ్యం ఉండటంతో పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోలేదు.

అంతేకాదు.. ఉత్త ఆరోపణలు చేస్తారంటూ వారి కంప్లైంట్ల మీద చర్యలు తీసుకోని పరిస్థితి. దీంతో.. న్యాయం కోసం వారు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆ ఇద్దరు దుర్మార్గులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఉదంతం వెలుగు చూడటంతో ఇప్పుడు అక్కడ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.