జైల్లో ఉన్న ఆ నటికి బెయిల్.. మరో ఏడాది వరకు రాదట
కన్నడనాట సంచలనంగా మారిన అభిమాని హత్య కేసుకు సంబంధించిన పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.
By: Tupaki Desk | 15 Dec 2025 9:43 AM ISTకన్నడనాట సంచలనంగా మారిన అభిమాని హత్య కేసుకు సంబంధించిన పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తోపాటు నిందితురాలిగా నిలిచింది కన్నడ నటి పవిత్ర గౌడ్. ఈ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెకు మరో ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు.
పెళ్లైన స్టార్ హీరో దర్శన్.. నటి పవిత్ర గౌడ్ తో రిలేషన్ షిప్ లో ఉండటం.. మరోవైపు ఆమెను అతిగా అభిమానించే రేణుకాస్వామి చర్యలతో ఇబ్బందులకు గురికావటం.. ఈ క్రమంలో ఆమె అభిమాని రేణుకా స్వామిని హత్య చేసేందుకు దర్శన్ ప్లాన్ చేసి.. అత్యంత దారుణ రీతిలో హత్య చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. నటి పవిత్రకు తాను చేసిన సినిమాలతో కంటే కూడా దర్శన్ తో ఉన్న రిలేషన్ తో ఆమె పాపులర్ గా మారినట్లు చెబుతారు. అంతేకాదు.. ఆమె కన్నడ నటిగా అందరికి సుపరిచితురాలు అయ్యే నాటికే పెళ్లై.. ఒక కూమార్తె కూడా ఉంది. మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న వేళలోనే దర్శన్ తో లవ్ ట్రాక్ ప్రారంభమై.. చివరకు వారిద్దరు రిలేషన్ షిప్ లో ఉండే వరకు వెళ్లింది.
మరోవైపు 33 ఏళ్ల రేణుకాస్వామి చిత్రదుర్గకు చెందినోడు. కన్నడ నటుడు దర్శన్ కు పెద్ద ఫ్యాన్. అయితే.. తన అభిమాన నటుడు రిలేషన్ లో ఉన్న పవిత్రకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు.. అశ్లీల ఫోటోల్ని పంపేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె.. దర్శన్ కు ఇతడి గురించి కంప్లైంట్ చేసింది. అతడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన దర్శన్.. తన అనుచరులతో హత్యకు ప్లాన్ చేశాడు.
రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఒక షెడ్ వద్దకు తీసుకెళ్లి.. అక్కడ తీవ్రంగా హింసించారు. కర్రలతో కొట్టటం.. ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వటం లాంటివి చేశారు. తీవ్ర గాయాలతో.. ఎక్కువ రక్తస్రావంతో అతను మరణించాడు. హత్య తర్వాత సాక్ష్యాలు నాశనం చేసేందుకు రేణుకాస్వామి డెడ్ బాడీని బెంగళూరులోనిఒక మురుగునీటి కాలువలో పడేశారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారటం.. నటుడు దర్శన్ .. నటి పవిత్రతో పాటు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యను కప్పిపుచ్చుకోవటానికి నిందితులకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు చెల్లింపులు జరిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
రేణుకా స్వామి హత్య కేసులో ఏ1గా ఉన్న నటి పవిత్రా గౌడ్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేయటం. బెయిల్ ఆర్జీలు కింది కోర్టుల నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు రద్దు చేస్తూ ఉండటం తెలిసిందే. పవిత్రా తరఫు సీనియర్ న్యాయవాది బాలన్ కేసు విచారణ చేపట్టటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెకు బెయిల్ ఎప్పుడు లభించే వీలుందన్న ప్రశ్నకు.. మరో ఏడాది వరకు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొదటి అభియోగ పత్రాన్ని పోలీసులు దాఖలు చేసినా.. అందులో చాలానే తప్పుడు వివరాల్ని పవిత్ర పై నమోదు చేసినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద పుట్టెడు ఆశలు పెట్టుకుంటే.. మరో ఏడాది సమయం వరకు బెయిల్ లభించదన్న మాటతో.. రేణుకాస్వామి హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
