Begin typing your search above and press return to search.

సినిమా స్టోరీ కాదు.. షాకింగ్ మలుపుల రియల్ క్రైం స్టోరీ

ఈ మొత్తం ఎపిసోడ్ లోకి వెళితే.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఒక రియల్ క్రైం వెలుగు చూస్తుంది. దీనంతటికి తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:47 AM GMT
సినిమా స్టోరీ కాదు.. షాకింగ్ మలుపుల రియల్ క్రైం స్టోరీ
X

కరెంటు షాక్ తో పూర్తిగా కాలిపోయి.. మరణించి ఉంటారని భావించిన ఒక వ్యక్తికి పోస్టు మార్టం చేసి అంతిమ సంస్కారాలకు సిద్ధమవుతున్న వేళ.. సదరు వ్యక్తే వేరే నెంబరు నుంచి ఫోన్ చేసి.. అరే.. నేను గుర్తు తెలియని ప్లేస్ లో పడి ఉన్నాను.. అంటూ చేసిన కాల్ తో ఒక్కసారి ఉలిక్కిపడిన వైనం ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లోకి వెళితే.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఒక రియల్ క్రైం వెలుగు చూస్తుంది. దీనంతటికి తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. అసలేం జరిగిందంటే..

రంగంపేట మండలంలోని వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి పూసయ్యకు చెందిన పొలంలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ వద్ద పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీతో పాటు.. పూసయ్య చెప్పులు కనిపించాయి. దీంతో.. అతను కరెంటు షాక్ కు గురై ఇలా కాలిపోయాడని భావించి.. డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయించారు. ఇలాంటివేళలో.. పూసయ్య బంధువులు ఒకరికి ఫోన్ వచ్చింది. అవతల ఫోన్లో మాట్లాడుతున్నది పూసయ్య అని చెప్పటంతో ఒక్కసారి షాక్ తిన్నాడు. మరి.. ఈ డెడ్ బాడీ ఎవరిది? అన్న సందేహానికి సమాధానం చెప్పేలా.. తాను గుర్తు తెలియని కొత్త ప్లేస్ లో ఉన్నానని.. తనను వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరాడు.

పరుగున పూసయ్య చెప్పిన ప్లేస్ కు వెళ్లిన అతడి బంధువులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు పూసయ్య. తాను పొలంలో పని చేసుకుంటున్న వేళ.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించటాన్ని చూశానని.. ఆ వెంటనే వారిని గట్టిగా నిలదీస్తే తనపై దాడి చేసి.. తన చెప్పుల్ని ఆ డెడ్ బాడీ దగ్గర పడేసి.. తనను ఆటోలో తీసుకెళ్లారని చెప్పాడు. ఆ టైంలో తాను స్ప్రహ తప్పి ఉన్నానని.. తనకు తెలివి వచ్చే టైంకు రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలంలో పడి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పాడు. అక్కడి వారి సెల్ తీసుకొని ఫోన్ చేసినట్లుగా చెప్పాడు. దీంతో.. హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారిని తీసుకొచ్చిన ఆటో ఎవరిది? లాంటివి ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలుసిసలు ట్విస్టు ఏమంటే.. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఒక డెడ్ బాడీని విద్యుత్ షాక్ తో కాలిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఎలా నిర్దారిస్తారు? వారికి.. ఆ తేడా తేలియకుండా ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. పూసయ్య మాటలతో కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది.