మాజీ భార్యను చంపిన కేసులో షాకింగ్ ట్విస్టులెన్నో
దీంతో అతడు మొదట కెనడాకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది.
By: Garuda Media | 20 Feb 2026 11:48 AM ISTసంచలనంగా మారిన మాజీ భార్యను హత్య చేసిన మొదటి భర్త ఉదంతం వెనుక షాకింగ్ ట్విస్టులు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. మాజీ భార్యను ఆవేశంతో చంపలేదని.. పక్కా ప్లానింగ్.. రెండునెలల పాటు నిరీక్షణ. ఆపై నాలుగు రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాతే తుదముట్టించిన వైనం పోలీసులు విచారణలో వెలుగు చూసింది. ఈ ఉదంతంలో చోటు చేసుకున్న పరిణామాలకు పోలీసులు సైతం విస్తుపోతున్న పరిస్థితి. తాను అనుకున్నది అనుకున్నట్లు చేశానని.. తనను చంపేసినా ఫర్లేదని.. తన లక్ష్యం నెరవేరిందని పేర్కొంటున్న నిందితుడి తీరుతో పోలీసులు విస్మయానికి గురవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివరకు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి.. రెక్కీ వేసి చంపే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న వివరాల్ని నిందితుడి నుంచి పోలీసులు సేకరించారు.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 32 ఏళ్ల మహేశ్, మహారాష్ట్రకు చెందిన సునీతలు పరిచయమై ప్రేమలో పడ్డారు. సునీత వాళ్ల అమ్మ పుట్టిల్లు మంధని కావటంతో ఆమె తరచూ అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం మహేశ్ పరిచయమ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. బీటెక్ పూర్తి చేసిన మహేశ్ 2019 లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. 2022లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కెనడాకు వెళ్లేందుకు మహేశ్ కు వీసా వచ్చింది కానీ సునీతకు రాలేదు.
దీంతో అతడు మొదట కెనడాకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అనంతరం వీసా రావటంతో కెనడాకు తీసుకెళ్లాడు. తరువాత ఇద్దరి మద్య గొడవలకు దారి తీసింది. దీంతో భర్త వేధిస్తున్నాడంటూ కెనడా పోలీసుల సాయంతో ఇండియాకు తిరిగి వచ్చేసింది. అనంతరం కెనడాలో ఉన్న భర్త మీదా.. మందనిలో ఉన్న అత్తమామలపై గ్రహహింస కేసు, విడాకుల కేసు పెట్టింది. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాకున్నా.. 2024లో పెద్దల సమక్షంలో వారు విడిపోయారు.
అయితే.. విడాకుల అనంతరం శ్రీనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉండగా మహేశ్ తల్లి ఇటీవల గుండెపోటుతో మరణించింది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చిన మహేశ్.. తిరిగి కెనడాకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. ఎందుకంటే అతడిపై కేసు ఉండటంతో అనుమతి లభించలేదు. మరోవైపు సునీత మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా ఉంటుందన్న ఆగ్రహంతో రగిలిపోయిన మహేశ్.. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించాడు. అయినా లభించలేదు.
ఈ క్రమంలో ఇన్ స్టాలో ఆమె చేసిన రీల్ తో ఆమె హైదరాబాద్ లోని వనస్థలిపురం కాప్రాయి చెరువు సమీపంలో ఉంటుదన్న విషయాన్ని గుర్తించాడు. దగ్గర్లోని ఒక హాస్టల్ లో ఉంటూ సునీత హత్యకు ప్లాన్ చేవాడు. ఇలా రెండు నెలల పాటు వారి కదలికలపై కన్నేసిన అతను.. నాలుగు రోజులు రెక్కీతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అద్దె కారులో ఇంటి తలుపులు కోసేందుకు గ్రైండర్ కట్టర్.. ఛైన్ కట్టర్.. పెప్పర్ స్ప్రే.. సునీతను హత్య చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ క్యాన్ తన వెంట తీసుకెళ్లాడు. తన ప్లాన్ లో భాగంగా ఇంటి తలుపు కొట్టి సునీత కంట్లో పెప్పర్ స్ర్పే కొట్టి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఆపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకునే సమయంలో పోలీసులు అతడ్ని అదపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి శిక్ష విధించినా సిద్ధమని.. చావటానికి కూడా వెనుకాడనంటూ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు చెబుతున్నారు.
