Begin typing your search above and press return to search.

కొత్త దోపిడి... ప్రేమ జంట కనిపిస్తే చాలు వీరి పంట పండినట్టే!

అవును... తాజాగా ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ ఓ ముఠా రెచ్చిపోతుంది

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:30 PM GMT
కొత్త దోపిడి... ప్రేమ జంట కనిపిస్తే చాలు వీరి పంట పండినట్టే!
X

కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా కొంతమంది క్రియేటివ్ గా ఆలోచిస్తుంటారు! పనికిమాలిన పనులకు పాల్పడుతుంటారు! బ్లాక్ మెయిల్ చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటుంటారు!! ఈ క్రమంలో ఇప్పటికే లోన్ యాప్స్ రూపంలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తుంటే... అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయిస్తూ మరోరకం బ్లాక్ మెయిల్ మోసాలకు పాల్పడుతుంటారు కొంతమంది దుండగులు! ఈ క్రమంలో తాజాగా ప్రేమ జంటలే లక్ష్యంగా సరికొత్త దోపిడీ తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ ఓ ముఠా రెచ్చిపోతుంది. ఎవరైనా ప్రేమ జంటలు కనిపిస్తే.. వారి కంట కనిపించకుండా రహస్యంగా వారి ఫోటోలు, వీడియోలు తీస్తుంది ఆ బ్యాచ్. అనంతరం వారికి ఆ ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంది. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఈ ఫోటోలు బయట పెడతామంటూ బెదిరింపులకు దిగుతుంది. ఈ తరహా దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రం నల్గొండలో ఆరుగురు యువకులు బృందంగా ఏర్పడి బ్లాక్ మెయిల్ పనులు చేయడం మొదలుపెట్టారు. ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలే లక్ష్యంగా వీరి దందా సాగుతుంది. ఆ ప్రేమ జంట ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని ఈ ముఠా టార్గెట్‌ చేస్తుంది. వీడియోలు ఫోటోలు తీసి బెదిరిస్తుంది. అనంతరం వారి నుంచి డబ్బు, నగలు, విలువైన వస్తువులు తీసుకుంటుంది.

అయితే... ఇంత జరిగినా చాలా మంది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఉండిపోయారంట. అయితే... వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో పోలీసులు ఫిర్యాదులు అందాయని తెలుస్తుంది. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు నల్గొండకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు! అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచారు.

అరెస్ట్ అనంతరం నిందితుల నుంచి బంగారు ఉంగరాలు, ఖరీదైన వాచీలు, సెల్‌ ఫోన్లు, రెండు టీవీలు, ఇన్వర్టర్‌, మొదలైనవి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది!! ఇలాంటి దోపిడీలకు కూడా పాల్పడుతున్నారా అంటూ ప్రేమ జంటలు ఫైరవుతున్నాయని తెలుస్తుంది! వీరిపై ఫిర్యాదులు చేయకుండా మిన్నకుండిపోయిన బాధితులు వీరి అరెస్ట్ విషయం తెలుసుకుని హ్యాపీ ఫీలవుతున్నారని అంటున్నారు.