Begin typing your search above and press return to search.

దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమానిని చంపేశారు

దీపావళికి కాదు కానీ తర్వాత వేరే రోజున డబ్బులు ఇస్తానని చెప్పగా.. కోపంతో రగిలిపోయిన వారిద్దరూ అడిగినంతనే డబ్బులు ఇవ్వలేదని యజమానిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:44 AM GMT
దీపావళి బోనస్ ఇవ్వలేదని యజమానిని చంపేశారు
X

దీపావళి సందర్భంగా ఇవ్వాల్సిన పండుగ బోనస్ ఇవ్వలేదన్న కోపంతో యజమానిని దారుణంగా చంపేసిన ఉదంతం షాకింగ్ గా మారింది.మహారాష్ట్ర నాగపూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం తీవ్ర కలకలాన్ని రేపింది. హత్యకు గురైన వ్యక్తి మాజీ సర్పంచ్ గా పోలీసులు గుర్తించారు. నాగపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని ధాబాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ కు చెందిన మండ్లాకు చెందిన ఛోటు.. ఆదిలు ఒక లేబర్ కాంట్రాక్టర్ ద్వారా మహారాష్ట్రలోని నాగపూర్ లోని ఒక ధాబాలో పనికి చేర్చుకున్నారు. ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పండుగ బోనస్ అడగటంతో విభేదాలు తలెత్తినట్లుగా పోలీసులు గుర్తించారు. దీపావళికి కాదు కానీ తర్వాత వేరే రోజున డబ్బులు ఇస్తానని చెప్పగా.. కోపంతో రగిలిపోయిన వారిద్దరూ అడిగినంతనే డబ్బులు ఇవ్వలేదని యజమానిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు

రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోతున్న యజమాని రాజు ధెంగ్రే మెడకు తాడు బిగించి.. తలపై బండరాయితో కొట్టారు. అక్కడితో ఆగకుండా పదునైన ఆయుధంతో దాడి చేసి ముఖాన్ని ఎవరూ గుర్తించలేనట్లుగా దాడికి పాల్పడ్డారు. యజమానిని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఒక బొంతలో చుట్టేసి.. అక్కడి నుంచి కారులో పరారయ్యారు. అయితే.. వీరు ప్రయాణిస్తున్న కారు నాగ్ పూర్ - ఉమ్రెడ్ రహదారిపైనున్న డివైడర్ ను ఢీ కొనటంతో నిందితులకు గాయాలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్న వైనం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. మరోవైపు ధాబా యజమాని ధెంగ్రే కుమార్తె తండ్రికి ఫోన్ చేసినా లిఫ్టు చేయకపోవటంతో ఆమె పక్కనే ఉన్న పాన్ షాప్ వ్యక్తికి ఫోన్ చేసి.. తన తండ్రి గురించి ఆరా తీయగా.. అతడు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ తిన్నాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ధాబా యజమాని రాజకీయనాయకుడు కావటంతో ప్రత్యర్థుల కుట్రకు బలయ్యారా? ఆర్థికకారణాలే అతడి హత్యకు కారణమా? అన్న కోణంలో కేసును విచారిస్తున్నారు.