Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై రచ్చ... 'డబ్బులు ఇవ్వకపోతే బట్టలు విప్పేస్తా'!

అవును... ఒక బైకర్‌ ని లిఫ్ట్‌ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   26 Dec 2023 11:52 AM GMT
నడిరోడ్డుపై రచ్చ... డబ్బులు ఇవ్వకపోతే బట్టలు విప్పేస్తా!
X

"అతడు" సినిమాలో డైలాగ్... "హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది.. అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి" అన్నట్లుగా రెగ్యులర్ గా నేరాలు, సరికొత్త నేరాలకు భాగ్యనగరం అడ్డాగా మారుతుందనే కామెంట్లకు బలం చేకూర్చే సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా లిఫ్ట్ అడిగి.. అనంతరం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఒక కిలేడీ సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటన తాజాగా హైదరాబాద్ లో జరిగింది!

అవును... ఒక బైకర్‌ ని లిఫ్ట్‌ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. దీంతో ఈమె వ్యవహారం, తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు బాధితుడి. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

వివరాళ్లోకి వెళ్తే... బేగంపేటకు చెందిన 45ఏళ్ల వ్యక్తి ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బేగంపేట్‌ నుంచి గచ్చిబౌలికి బైక్‌ పై వెళ్తున్నాడు. ఈ సమయంలో బంజారాహిల్స్‌ లోని ఎస్.ఎన్.టీ. సిగ్నల్‌ వద్ద మాస్కు పెట్టుకున్న 35 ఏళ్ల మహిళ అతడిని లిఫ్టు అడిగింది. దానికి అతడు కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడని తెలుస్తుంది!

ఈ సమయంలో వాహనంపై ఎక్కించుకొని వెళ్తుండగా తన గదికి రావాలంటూ కోరింది. అనంతరం ముగ్ధ సిగ్నల్‌ వద్ద వాహనాన్ని నిలపాలని అడిగింది. వాహనాన్ని నిలిపిన అనంతరం అతడివద్ద నుంచి వాహన తాళంచెవులను లాక్కొంది. డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో మరో గత్యంతరం లేకో ఏమో కానీ... ఈ బెదిరింపుల క్రమంలో ఆ వ్యక్తి సమీపంలోని ఏటీఎం వద్దకు వెళ్లి రూ.25 వేల నగదు డ్రా చేసి ఆమెకు ఇచ్చాడు.

అయినప్పటికీ తృప్తి చెందని ఆమె… తనకు మరిన్ని డబ్బులు కావాలని.. ఇవ్వని పక్షంలో నడిరోడ్డుపై దుస్తులు విప్పేస్తానని బెదిరించింది! అయినప్పటికీ ఇంకా తన వద్ద డబ్బులు లేవంటే లేవనడంతో ఎస్‌.ఎన్‌.టీ కూడలి వద్ద వదిలేయాలని డిమాండ్ చేసింది. అతను అలాగే ఆమెను తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు.

అనంతరం బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిలేడి కోసం గాలిస్తున్నారు. అయితే లిఫ్ట్ అడిగినప్పటినుంచి ఈ అల్లరి చేసేవారకూ ఆ మహిళ మాస్క్, కళ్లద్దాలు ధరించి ఉండటంతో బాధితురాలు ముఖం ఇతడు చూడలేకపోయాడని తెలుస్తుంది.