Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రి... మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి...!

హైదరాబాద్ సనత్‌ నగర్‌ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Sept 2023 11:26 PM IST
హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రి... మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి...!
X

అసాంఘిక కార్యకలాపాలకు ఈఎస్ఐ ఆసుపత్రి అడ్డాగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయని చెబుతున సమయంలో... పేషంట్ అటెండర్‌ లను ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వరసగా ఆరోపణలు వినిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది.

అవును... హైదరాబాద్ సనత్‌ నగర్‌ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో పని చేసే ఓ యువకుడు ఓ పేషెంట్ సోదరి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. దీంతో తేరుకున్న ఆ బాలిక ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సుమారు వారం రోజుల నుండి ఈ ఆసుపత్రిలో బాధిత బాలిక (13) అన్నయ్య చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ సమయంలో అన్నయ్యకు తోడుగా ఉంటున్న ఆ బాలికపై ఆ ఆస్పత్రిలో లిఫ్ట్ ఆపరేటర్‌ గా పని చేస్తున్న ఓ యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలో... గతరాత్రి బాలిక లిప్ట్‌ లో వెళ్తున్న సమయలో ఆమెను అడ్డుకున్నాడు. ఆ తర్వాత లిఫ్ట్ ని పై అంతస్తుకు తీసుకెళ్ళాడు. ఆపై ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు.

దీంతో అక్కడనుంచి తప్పించుకున్న బాధిత బాలిక తనపై జరిగిన దారుణాన్ని ఆస్పత్రి సిబ్బందికి చెప్పింది. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు చేసిన అనంతరం... ఆమె అత్యాచారానికి గురైందని రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం బాధిత బాలిక ఎస్‌ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.