Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ న్యూడ్ కాల్... హైదరాబాద్ చిరువ్యాపారి లబో దిబో!

హనీ ట్రాప్... ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిన ఆన్ లైన్ క్రైం లలో ఒకటి.

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:49 AM GMT
ఆన్ లైన్ న్యూడ్ కాల్... హైదరాబాద్ చిరువ్యాపారి లబో దిబో!
X

హనీ ట్రాప్... ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిన ఆన్ లైన్ క్రైం లలో ఒకటి. ఒక మగాడి బలహీనతలను "పూర్తి"గా క్యాష్ చేసుకునే పనికి పూనుకుంటున్న కొంతమంది మహిళలు ఈ విషయంలో చాలా టెక్నిక్ గా ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వయసుతో సంబంధం లేకుండా ఈ హనీ ట్రాప్ లో పడి ఆర్ధికంగా బలైపోయిన ఎంతోమంది కథలు ఇప్పటికే మనం చూశాం!

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక చిరు వ్యాపారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరబాద్ లో ఒక చిరు వ్యాపారికి సోషల్ మీడియాలో పరిచయమైన ఒక యువతి వలపుల వల విసిరింది. దీంతో ఇతను బాగా టెంప్ట్ అయ్యాడు. ఆ బలహీనతనీ సదరూ యువతి ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో పడింది. అయితే ఇక తనవల్ల కాదని భావించిన ఆ వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ కు చెందిన ఒక చిరువ్యాపారి (32) కి ఫేస్ బుక్ లో ఒక యువతి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపించింది. దీంతో యాక్సెప్ట్ చేసిన ఆ వ్యక్తి తెగ చాటింగ్ లు చేసేవాడట. దీంతో పరిచయం కాస్త ఫేస్ బుక్ ఛాటింగ్ నుంచి ఫోన్ నెంబర్స్ ఎక్స్ చేంజ్ చేసుకునే వారకూ వచ్చిందంట. అప్పుడే స్టార్ట్ అయ్యింది అసలు కథ!

ఇలా ఫోన్ నెంబర్స్ ఎక్స్ చేంజ్ చేసుకున్న అనంతరం.. ఫస్ట్ వాట్సప్ మెసేజ్ లు, అనంతరం ఆడియో కాల్స్ దాటి వీడియో కాల్స్ వరకూ వచ్చిందంట వ్యవహారం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగాక .. వాట్సాప్‌ కాల్‌ లో వలపు మాటలు చెబుతూ అతడి ఒంటిపై దుస్తులు తొలగించమని కోరిందట.

దీంతో ఇతడు ఆపనికి పూనుకున్నాడంట. ఈ సమయంలో అతడు పూర్తి న్యూడ్ గా మారిన అనంతరం వీడియో రికార్డ్ చేసిందంట. ఆమె మైకంలో ఉన్న యువకుడు ఆ విషయం గ్రహించలేదో ఏమో కానీ... అలా జరిగిపోయిందంట. ఆ తర్వాత ఆ న్యూడ్ వీడియోను బయట పెడతానంటూ బెదిరింపులకు దిగింది ఆ యువతి.

ఈ క్రమంలో ఆ నగ్న వీడియోను బహిర్గతం చేస్తానంటూ బెదిరించి.. బాధితుడి నుంచి విడతల వారీగా సుమారు 1.53 లక్షల రూపాయల డబ్బు కాజేసిందని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె మరింత సొమ్ము కావాలంటూ డిమాండ్‌ చేయటం ప్రారంభించిందట. దీంతో ఇక మరో ఆప్షన్ లేదని భావించిన ఆ వ్యక్తి... సిటీ సైబర్‌ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇలాంటి హనీ ట్రాప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.