Begin typing your search above and press return to search.

డ్రగ్స్ ఉన్న ఎవరి హీరో ప్రియురాలు?

ఈ క్రమంలో డ్రగ్స్ తో దొరికిన సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారని తెలుస్తుంది. అయితే... ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 12:40 PM GMT
డ్రగ్స్  ఉన్న ఎవరి హీరో ప్రియురాలు?
X

తెలంగాణలో పోలీసులు ఎంత పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నట్లుంటుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో... డ్రగ్స్ వ్యవహారానికీ టాలీవుడ్ కీ విడదీయలేని బంధంపై మరోసారి చర్చ మొదలైంది.

అవును... హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇందులో భాగంగా నార్సింగ్ లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఒక యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో డ్రగ్స్ తో దొరికిన సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారని తెలుస్తుంది. అయితే... ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. ఈ ఎండీఎంఏ డ్రగ్స్ ని గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాస్తవాన్నికి కొన్నాళ్ల క్రితం వరకు హైదరాబాదులో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని లింకులు తిరిగి తిరిగి టాలీవుడ్ పరిశ్రమకు కనెక్ట్ అవుతూ ఉండేవి. ఈ వ్యవహారం ఒకప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల మాధాపూర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఒక సినీ నిర్మాత డ్రగ్స్ పార్టీ అంటూ వచ్చిన వార్తలు కూడా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి... టాలీవుడ్ హీరో ప్రేయసి పేరుతో డ్రగ్స్ లింక్ తెలుగు సినీ పరిశ్రమకే ఏర్పడడం గమనార్హం. అయితే... ఆ టాలీవుడ్ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది!!