Begin typing your search above and press return to search.

భార్యపై భర్త అత్యాచారం చేసినా నేరమే.. గుజ‌రాత్ హైకోర్టు!

తన భార్యపై భర్త ఈ దారుణానికి పాల్పడినా అది కూడా అత్యాచారమేనని గుజరాత్‌ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 6:16 AM GMT
భార్యపై భర్త అత్యాచారం చేసినా నేరమే.. గుజ‌రాత్ హైకోర్టు!
X

భారత్ లో మహిళలపై లైంగిక హింస ఎక్కువగా జరుగుతుందని.. అయితే పలు సందర్భాల్లో ఆ హింస వెలుగులోకి రావడంలేదని.. ఈ సమయంలో ఆ హింసను కప్పిపెడుతున్న నిశబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి! ఈ సమయంలో... అత్యాచారానికి సంబంధించి తాజాగా గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా దాంపత్య జీవితంలో అత్యాచారన్ని ప్రస్థావించింది!

అవును... అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని.. ఇందులో భాగంగా... తన భార్యపై భర్త ఈ దారుణానికి పాల్పడినా అది కూడా అత్యాచారమేనని గుజరాత్‌ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. చాలా వ‌ర‌కు కేసుల్లో భ‌ర్త అత్యాచారానికి పాల్పడితే అతడిని వ‌దిలేస్తార‌ని.. అయితే త‌న ఉద్దేశంలో మాత్రం రేప్‌ ను రేప్‌ గానే భావిస్తాన‌ని గుజ‌రాత్ హైకోర్టు న్యాయమూర్తి జ‌స్టిస్ దివ్యేశ్ జోషి తెలిపారు.

తాజాగా.. భార్యతో జరిపిన శృంగారాన్ని వీడియోలు తీసి, పోర్న్‌ వెబ్‌ సైట్లలో పెట్టిన భర్తకు.. ఈ దారుణానికి సహకరించిన అతడి తల్లిదండ్రులకు బెయిల్‌ ను మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... ఐపీసీలోని సెక్షన్‌ 375లోని 2వ మినహాయింపు ప్రకారం.. మేజర్‌ అయిన భార్యతో భర్త జరిపే బలవంతపు శృంగారం రేప్‌ గా పరిగణించబడదు కానీ... ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మినహాయింపు ఇవ్వలేమని దివ్యేశ్ తెలిపారు.

ఇదే సమయంలో ఐపీసీలోని చాలా చ‌ట్టాల‌ను యూకే నుంచి తీసుకున్నామన్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన... బ్రిట‌న్‌ లో రేప్ విష‌యంలో భ‌ర్తల‌కు మిన‌హాయింపు లేదని.. ఇక్కడ కూడా ఆ రూల్‌ ను ఎత్తేయాలని న్యాయమూర్తి దివ్యేశ్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భారత్‌ లో స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.