Begin typing your search above and press return to search.

కాపురానికి రావట్లేదని భార్యకు డెత్ సర్టిఫికేట్ పంపాడు

వీడ్నిభర్త అందామా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించాడో సైకో భర్త. భార్య పుట్టింటి నుంచి రావట్లేదన్న కోపంతో ఆమెకు డెత్ సర్టిఫికేట్ పంపిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   28 Nov 2025 10:36 AM IST
కాపురానికి రావట్లేదని భార్యకు డెత్ సర్టిఫికేట్ పంపాడు
X

వీడ్నిభర్త అందామా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించాడో సైకో భర్త. భార్య పుట్టింటి నుంచి రావట్లేదన్న కోపంతో ఆమెకు డెత్ సర్టిఫికేట్ పంపిన వైనం షాకింగ్ గా మారింది. ఈ దారుణ ఉదంతం వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరుకు చెందిన వ్యక్తి చేశాడు. పద్నాలుగేళ్ల క్రితం ఆదిలక్ష్మితో దూలంవారి పల్లెకు చెందిన మారుతి రాజుకు పెళ్లైంది.

వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు. అయితే.. దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో విసుగు చెందిన ఆదిలక్ష్మి నెల క్రితం భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. భార్య పేరుతో డెత్ సర్టిపికేట్ తయారు చేయించిన రాజు ఆమెకుపోస్టులో దాన్ని పంపాడు.

తాను బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్ పంపిన భార్యపై కలసపాడు పోలీసులకు ఆదిలక్ష్మి కంప్లైంట్ చేయటంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.అయితే.. మరణించకుండానే డెత్ సర్టిఫికేట్ ఎలా జారీ చేశారు? ఎవరు జారీ చేశారు? లాంటి ప్రశ్నలతో పాటు భర్త రాజును.. వారి ముగ్గురుపిల్లల్ని ముద్దనూరు పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. ఈ క్రమంలో మారుతిరాజు తన తల్లి మరణధ్రువపత్రాన్ని ఆదిలక్ష్మి పేరుతో మార్పులు చేసి.. దాన్నే ఆమెకు పంపినట్లుగా గుర్తించారు. దీంతో.. అతడ్ని మందలించిన పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.