Begin typing your search above and press return to search.

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   29 Oct 2026 10:33 PM IST
సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!
X

సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు ఊరటనిచ్చే దిశగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే, బాధితులు కోల్పోయిన మొత్తానికి పరిహారం అందించేలా నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది.

ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులమని, పోలీసులమని నమ్మించి ప్రజల జీవితకాల పొదుపులను కాజేస్తున్న నేరగాళ్లను అడ్డుకోవడంలో బ్యాంకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.

ఖాతాదారుల లావాదేవీల సరళికి భిన్నంగా భారీ మొత్తంలో డబ్బు బదిలీ అవుతున్నప్పుడు బ్యాంకులు అప్రమత్తం కావాలని కోర్టు అభిప్రాయపడింది. అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయడం, వాటిని పరిశీలించడం వంటి చర్యలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రతిపాదించిన కొత్త KYC నిబంధనలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. బ్యాంకుల నిర్లక్ష్యానికి బాధ్యత నిర్ణయించేలా నిబంధనలు లేకపోతే, తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

అయితే, ప్రతి సైబర్ మోసానికి బ్యాంకులే పరిహారం చెల్లించాలనే తుది నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. బ్యాంకుల తప్పిదం వల్లే మోసం జరిగినట్లు నిర్ధారణ అయితే బాధితులకు న్యాయం జరిగేలా వ్యవస్థను రూపొందించడమే కోర్టు లక్ష్యం.