Begin typing your search above and press return to search.

యువతిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి... వీడియో!!

దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలే ఒక దారుణం జరిగిపోయింది. ఒక యువకుడు ఓ బాలికపై కత్తితో దాడి చేశాడు

By:  Tupaki Desk   |   24 March 2024 7:29 AM GMT
యువతిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి... వీడియో!!
X

దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలే ఒక దారుణం జరిగిపోయింది. ఒక యువకుడు ఓ బాలికపై కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన స్థానిక ముఖర్జీ నగర్ లో చోటుచేసుకుంది. ఈ దాడికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ... అతడిని స్థానికంగా ఆటపట్టించడం, వెక్కిరించడం వంటివి చేయడంతోనే ఉక్రోషంతో ఈ పనికి పూనుకున్నాడని చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... దేశ రాజధాని ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఒక బాలిక లైబ్రరీకి వెళ్తుంది. ఈ సమయంలో 22 ఏళ్ల అమన్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అతడు పరుగున రావడంతో ఆమె కిందపడిపోయింది.. దీంతో పలుమార్లు ఆమెపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఈ నెల 22న జరగగా... సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అరెస్ట్ చేశారు.

ఆ దాడి జరిగిన సమయంలో ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియోనూ పోలీసులు విడుదల చేశారు! ఓ యువకుడు వేగంగా వచ్చి ఒక బాలికపై కత్తితో పలుమార్లు దాడి చేయడం ఈ వీడియోలు కనిపించింది. దీంతో.. ఆ బాలిక ఎవరు, అతడికి ఈమెకు ఉన్న సంబంధం ఏమిటి.. అసలు ఇంత దారుణమైన దాడి ఎందుకు జరిగింది అనే చర్చ మొదలైంది.

అయితే... ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు అమన్ అని.. అతడు స్థానికంగా ముఖర్జీ నగర్ లో పనీపాటా లేకుండా అక్కడక్కడా తిరుగుతుంటాడని చెబుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో... సమీపంలోని విద్యార్థులు కొంతమంది అమన్ ని పిచ్చివాడని అంటూ తరచూ ఎగతాళి చేసేవారని అంటున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని ఆ అమ్మాయికి కూడా ఎగతాలి చేసేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడానికి ముందు... లైబ్రరీలో చదువుకునేందుకు వెళ్తున్న బాలిక వేసిన ఒక జోక్ కారణంగా నిందితుడు కోపోద్రిక్తుడయ్యాడని.. దీంతో పక్కనే వ్యాపారి వద్ద ఉన్న కత్తిని తీసుకుని ఆమెపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారని అధికారులు అంటున్నారు! ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది! అయితే... బాలికకు స్వల్ప గాయాలు కావడంతో ఆమె క్షేమంగా ఉందని చెబుతున్నారు.