Begin typing your search above and press return to search.

తాగిన మత్తులో కొడుక్కి పెళ్లి సంబంధం అడిగిందని చంపేసింది

49 ఏళ్ల సరోజుకు కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటి పక్కనే నదియా అనే మహిళతన కుటుంబంతో నివసిస్తుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 12:00 PM IST
తాగిన మత్తులో కొడుక్కి పెళ్లి సంబంధం అడిగిందని చంపేసింది
X

అందరూ సహజ మరణంగా భావించారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ.. ఆమెను ఒక ఆంటీ చంపేసిన విషయాన్ని చూసిన చిన్నోడు ఒకడు.. బాధితురాలి కొడుక్కి చెప్పటంతో దారుణ హత్యోదంతం వెలుగు చూసింది.చిత్తూరు రూరల్ మండలం చర్లోపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంతకూ హత్యకు కారణం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకుంటే.. కొడుక్కి పెళ్లి సంబంధం అడగటం.. కులాలు వేరు కావటంతో ఆగ్రహించి.. హత్య చేసిన షాకింగ్ నిజం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

49 ఏళ్ల సరోజుకు కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటి పక్కనే నదియా అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తుంది. ఈనెల 12న సరోజ చనిపోయినట్లు కనిపించింది. సహజ మరణంగా భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు చేశారు. 15వ తేదీన సరోజ కొడుకు కన్నన్ వీధిలో వెళుతుండగా.. చిన్న కుర్రాడు ఒకరు.. ‘అన్నా మీ అమ్మను ఆ ఆంటీ చంపేసింది. మీ అమ్మను చంపేయటం చూశా. మీ అమ్మది సహజ మరణం కాదు. ఈ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు’ అని చెప్పటంతో షాక్ తిన్న కన్నన్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నకుర్రాడు ఇచ్చిన సమాచారం ప్రకారం సరోజను చంపింది పక్కింటి నదియా అన్న విషయాన్ని గుర్తించి.. ఆమె కోసం గాలింపులు చేపట్టారు. చివరకు తిరుమలలో ఉండగా నదియాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తమదైన శైలిలో విచారణ చేపట్టటంతో చివరకు అసలు నిజాల్ని బయటకు కక్కుసింది. తామిద్దరం మద్యం సేవించి ఉన్న వేళలో.. సరోజ తన కొడుక్కి నదియా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని కోరింది.

దీనికి నదియా ఒప్పుకోలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఆగ్రహానికి గురైన నదియా.. సరోజ ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి.. దిండుతో నొక్కి చంపేసినట్లుగా ఒప్పుకుంది. కులాలు వేర్వేరు కావటంతో పెళ్లికి వద్దనుకోవటం ఓకే. కానీ.. దానికే చంపేయాలా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.