Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

ఈ కిడ్నాప్ కేసులో ఓ యువతితో సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

By:  Tupaki Desk   |   29 Oct 2026 10:33 PM IST
ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!
X

బెంగళూరులో ఓ యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కిడ్నాప్ ఘటన కలకలం రేపాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మారతహళ్లిలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కనిపించకుండా పోవడంతో ఒకరి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఆరు గంటల్లోనే వారిని గుర్తించి రక్షించారు.

ఈ కిడ్నాప్ కేసులో ఓ యువతితో సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే, విచారణలో యువతి చేసిన ఆరోపణలతో కేసు కొత్త మలుపు తిరిగింది.

అక్టోబర్ 24 తెల్లవారుజామున ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. మరో ఉద్యోగి తనను గదిలో బంధించాడని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఇద్దరు టెకీలకు వ్యతిరేకంగా పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు.

మరోవైపు, యువతి బృందం ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసి, వారిలో ఒకరి తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలకు సంబంధించిన కేసులపై పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపితం కాలేదు.