Begin typing your search above and press return to search.

భార్యపై భర్త కాల్పులు... ఇన్ స్టా వీడియోలే కారణమా?

అవును... రాజస్థాన్‌ లోని ఇన్‌ స్టాగ్రాం ఇన్‌ ఫ్లుయెన్సర్ ను ఆమె భర్త కాల్చి చంపినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:07 AM GMT
భార్యపై భర్త కాల్పులు... ఇన్  స్టా వీడియోలే కారణమా?
X

రాజస్థాన్‌ లోని ఫలోడిలో ఇన్‌ స్టాగ్రాం ఇన్‌ ఫ్లుయెన్సర్ అనామికా బిష్ణోయ్‌ ను ఆమె భర్త కాల్చి చంపిన సంఘటనను చిత్రీకరించే భయానక వీడియో ఆన్‌ లైన్‌ లో వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో కుర్చున్న ఆమెపై అతడు కాల్పులు జరిపిన దృశ్యాలు.. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో బంధించబడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అవును... రాజస్థాన్‌ లోని ఇన్‌ స్టాగ్రాం ఇన్‌ ఫ్లుయెన్సర్ ను ఆమె భర్త కాల్చి చంపినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... అతి సమీపం నుంచి భర్త తన భార్య అయిన అనామికాను తుపాకీతో కాల్చడం వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్రమైన గాయం అవ్వడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ కు చెందిన మహిరాం కు అనామికా బిష్ణోయ్ కు వివాహం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె ఇన్ స్టా గ్రాం ఇన్ ఫ్లుయెన్సర్ గా మారింది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారని అంటున్నారు. అయితే ఈ విషయం ఆమె భర్తకు నచ్చలేదని తెలుస్తుంది. దీంతో గతకొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని సమాచారం.

ఈ సమయంలో ఫిబ్రవరి 25 - ఆదివారం సదరు మహిళ రాజస్థాన్‌ లోని ఫలోడిలో ఉమెన్స్ కలెక్షన్ సెంటర్‌ ను నిర్వహిస్తుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఆమె షాపులో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన భర్త ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఆమె భర్త తన షాపులోకి ప్రవేశించడం, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగడం వీడియోలో చూడొచ్చు.

ఈ సమయంలో కౌంటర్ లోపల ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా.. ఆమె భర్త కౌంటర్ దగ్గర నిలబడి కనిపించాడు. ఈ సమయంలో వాగ్వాదం పెరగడంతోనో ఏమో కానీ... అతడు తనతో తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో మొదటి రౌండ్ తర్వాత తుపాకీ జాం అవ్వడం.. దీంతో అతడు తిరిగి లోడ్ చేసి కాల్పులు జరపడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది.

అలా ఆమెపై కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలుస్తుంది. ఈ సమయంలో దాడి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆ మహిళపై దాడి చేసింది ఆమె భర్తే అని గుర్తించారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి విడాకులు, భరణం కేసు కోర్టులో విచారణలో ఉందని కథనాలొస్తున్నాయి!!