Begin typing your search above and press return to search.

యూనివర్సిటీలో కాల్పులు.. ప్రొఫెసర్ మృతి!

ఈ విషయాలపై స్పందించిన వర్సిటీ చాన్సలర్‌ కెవిన్‌ గుస్కివీజ్‌... నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని చెప్పారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 8:33 AM GMT
యూనివర్సిటీలో కాల్పులు.. ప్రొఫెసర్ మృతి!
X

అగ్రరాజ్యంలో అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా అక్కడ జరుగుతున్న కాల్పులు ప్రజలను హడలెత్తుస్తున్నాయి. ఎప్పుడు ఏ మూల తుపాకీ శబ్ధం వినిబడుతుందో అనే లెవెల్లో వారు ఆందోళనలో ఉన్నారన్నా అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో అగ్రరాజ్యంలో తుపాకీ కల్చర్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా యూనివర్సిటీలో కాల్పులు కలకలం రేపాయి.

అవును... రోడ్లపైనా, హోటల్స్ లోనూ, పబ్స్ లోనూ, పబ్లిక్ పార్కులలోనూ... కాదేదీ తుపాకీ వాడకానికి అనర్హం అన్నట్లుగా అమెరికాలో ప్రతీచోటా తుపాకీ శబ్ధం వినిపిస్తూనే ఉంది! ఈ క్రమంలో తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక ప్రొఫెసర్ మృతి చెందారు.

అమెరికా నార్త్‌ కరోలినా చాపెల్‌ హిల్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్సిటీ క్యాంపస్ లోకి చొరబడిన దుండగుడు.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో యూనివర్సిటీలోని అప్లైడ్ ఫిజికల్ సైన్సెస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ జిజీ యాన్ (38) మరణించారు.

ఈ కాల్పుల్లో ఈ ఫ్రొఫెసర్ మరణించగా... మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్యాంపస్‌ ను షట్‌ డౌన్ చేసిన అధికారులు... షూటర్ కోసం గంటల తరబడి వేటాడారు. ఈ క్రమంలో క్యాంపస్‌ కు 2.4 కిమీ దూరంలో ఉన్న చాపెల్ హిల్‌ లోని అతని ఇంటికి సమీపంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఈ క్రమంలో... గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన షూటర్ తైలీ క్విని అదుపులోకి తీసుకున్నామని.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని.. పోలీసులు వెల్లడించారు!

ఈ విషయాలపై స్పందించిన వర్సిటీ చాన్సలర్‌ కెవిన్‌ గుస్కివీజ్‌... నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని చెప్పారు. అయితే... వర్సిటీలో సడన్ గా కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో కాల్పుల ఘటనతో యూనివర్శిటీకి లాక్ డౌన్ ప్రకటించారు.

కాగా... ఈ వర్శిటీలో సుమారు 4,100 మంది అధ్యాపకులు.. 9,000 మంది సిబ్బందితో పాటు 32,000 మంది విద్యార్థులు ఉన్నారు.