Begin typing your search above and press return to search.

ప్రపంచంలోని మొదటి ట్రిలియనీర్ పై అంచనాలివే!

దీంతో ఈ ఐదుగురు బిలియనీర్ లలో ఒకరు వచ్చే దశాబ్ధకాలంలో ట్రిలియనీర్ స్థితికి చేరుకోవచ్చని ఫార్చ్యూన్, యు.ఎస్‌.ఎ టుడే పేర్కొన్నాయి!

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:43 AM GMT
ప్రపంచంలోని మొదటి ట్రిలియనీర్  పై అంచనాలివే!
X

ప్రపంచంలోని మొదటి ట్రిలియనీర్ (1000 బిలియన్స్) వచ్చే దశాబ్దంలో కనిపించవచ్చని యూకే ఆధారిత ఆక్స్‌ ఫామ్ ఇంటర్నేషనల్ ఈ వారం ప్రపంచ అసమానతలపై ప్రచురించిన అంచనాలో "ఇన్‌క్వాలిటీ ఇంక్ (ఆదాయ అసమానతలు)" పేరుతో పేర్కొంది. ఇదే సమయంలో ఈ ఆక్స్‌ ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచలోని పేదరికాన్ని అంతం చేయడం యూఎన్ కు మరో 229 సంవత్సరాల వరకు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. కాగా... 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలనేది యూఎన్ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే.

అవును... దేశం ఏదైనా, ప్రాంతం మరేదైనా.. ఈ ప్రపంచంలో ఎన్నో అసమానతలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరో పదేళ్లలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ వచ్చే అవకాశం ఉందని నివేధికలు చెబుతుండగా... పేదరికాన్ని రూపుమాపడానికి మాత్రం మరో 229 సంవత్సరాల వరకూ సాధ్యం కాదని అవే నివేధికలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిలో ఈ ప్రపంచంలో అసమానతలు రాజ్యమేలుతున్నాయి!!

ఇదే సమయంలో ఆక్స్‌ ఫామ్ నివేదిక ప్రకారం... 2020 నుండి ప్రపంచంలోని ఐదుగురు అత్యంత సంపన్నులు తమ సంపదను రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకున్నారని వెల్లడైంది. ఇందులో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఎల్.వి.ఎం.హెచ్. యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, పెట్టుబడిదారు వారెన్ బఫెట్ పేర్లు ఉన్నాయి.

దీంతో ఈ ఐదుగురు బిలియనీర్ లలో ఒకరు వచ్చే దశాబ్ధకాలంలో ట్రిలియనీర్ స్థితికి చేరుకోవచ్చని ఫార్చ్యూన్, యు.ఎస్‌.ఎ టుడే పేర్కొన్నాయి! తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ రియల్ టైం ర్యాంకింగ్స్ ప్రకారం... ఎలాన్ మస్క్ 226.6 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉండగా... బెర్నార్డ్ ఆర్నాల్ట్, అతని కుటుంబం 175.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఇక మిగిలిన స్థానాల్లో వరుసగా... 173.6 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్, 134.9 బిలియన్ డాలర్లతో లారీ ఎలిసన్, 119.5 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ లు ఉన్నారు. ఈ సమయంలో కోవిడ్ అనంతరం బిలియనీర్లు 2020 కంటే 3.3 బిలియన్ డాలర్లు ధనవంతులుగా ఉన్నారని ఆక్స్‌ ఫామ్ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 బిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారారని తెలిపింది.