Begin typing your search above and press return to search.

టాటా దూకుడు.. మరిన్ని కంపెనీల్ని కొనేస్తారట

దేశంలో విశ్వసనీయ బ్రాండ్లలో అందరికంటే ముందుండే టాటాకు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్ ) దూకుడు వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 12:30 PM GMT
టాటా దూకుడు.. మరిన్ని కంపెనీల్ని కొనేస్తారట
X

దేశంలో విశ్వసనీయ బ్రాండ్లలో అందరికంటే ముందుండే టాటాకు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్ ) దూకుడు వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున కంపెనీల్ని కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ.. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీల్ని కొనేందుకు వీలుగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. టీసీపీఎల్ ఎండీ.. సీఈవో సునీల్ డిసౌజా తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ఇటీవల చింగ్స్ సీక్రెట్.. స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల సొంతదారు క్యాపిటల్ ఫుడ్స్ ను రూ.5100 కోట్లతో కొనుగోలు చేసి.. దానికి సంబంధించిన డీల్ ను పూర్తి చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆర్గానిక్ ఇండియాను రూ.1900 కోట్లతో కొనుగోలు చేయటం తెలిసిందే. 2011లోఈ సంస్థ బెంగళూరుకు చెందిన కొట్టారం అగ్రో పుడ్స్ ను రూ.155.8 కోట్లకు కొనుగోలు చేయటం తెలిసిందే.

కంపెనీ విస్తరణకు వీలుగా వరుస నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో టాటా టీ, టెట్లీ, టాటా సాల్ట్ తదితర బ్రాండ్లు ఈ కంపెనీ కింద ఉన్నాయి. ఆహార.. పానీయాల విభాగంలో టీసీపీఎల్ తన పోర్ట్ ఫోలియోను విస్తరించటం తెలిసిందే. ఎవరైనా మెరుగైన బ్రాండ్.. సాంకేతికత.. టీంతో వస్తే ఆయా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. 2022-233 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ.13,783 కోట్లు. ఏమైనా ఈ ఏడాది మరిన్ని కొనుగోళ్లు ఖాయమంటున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఈ నెల 19న టీసీపీఎల్ బోర్డు సమావేశం కానుంది. ఇందులో నిధుల సమీకరణ ప్రతిపాదనలపై చర్చతో పాటు కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.