Begin typing your search above and press return to search.

టాటా అంటే అంతే మరి.. రూ.15వేల పెట్టుబడికి రోజులో అంత లాభం

టాటా టెక్నాలజీస్ షేరుఇష్యూ ధర రూ.500తో పోలిస్తే షేరు ట్రేడిండ్ 140 శాతం లాభంతో రూ.1199.95 వద్ద ప్రారంభం కావటం గమనార్హం.

By:  Tupaki Desk   |   1 Dec 2023 5:01 AM GMT
టాటా అంటే అంతే మరి.. రూ.15వేల పెట్టుబడికి రోజులో అంత లాభం
X

స్టాక్ మార్కెట్లో వేలాది షేర్లు ఉన్నా.. టాటా షేర్లకు ఉండే లెక్కే వేరుగా ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీవోకు వచ్చిన ఈ సంస్థకు జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏ రేంజ్ లో ఉన్నదో ఇప్పటికే తెలిసిందే. తాజాగా.. సదరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ మొదలుపెట్టిన మొదటి రోజున లాభాల పంట పండించింది. గడిచిన కొద్దిరోజులుగా టాటా టెక్సాలజీస్ ఐపీవో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఈ షేరు గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇందుకు తగ్గట్లే.. ట్రేడింగ్ తొలిరోజున సదరు షేర్ పండించిన లాభాల పంటను చూసినప్పుడు.. టాటా టెక్నాలజీస్ ను లైట్ తీసుకున్న వారంతా ఊసురుమనేలా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి.

టాటా టెక్నాలజీస్ షేరుఇష్యూ ధర రూ.500తో పోలిస్తే షేరు ట్రేడిండ్ 140 శాతం లాభంతో రూ.1199.95 వద్ద ప్రారంభం కావటం గమనార్హం. ఇంట్రాడేలో 180 శాతం దూసుకెళ్లి రూ.1400 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 162.85 శాతం లాభంతో రూ.1314 వద్ద ముగిసింది. ఈ షేరును ఐపీవోలో మదుపు చేసి.. అలాట్ అయిన వారంతా భారీ లాభాల్ని మూటగట్టుకున్నట్లైంది.

ఒక్కో లాట్ 15వేల రూపాయిలు కాగా.. ఒక్కొక్కరికి 30 షేర్లు వచ్చాయి. మొదటి రోజున జరిగిన ట్రేడింగ్ పుణ్యమా అని ఒక్కొక్కరికి రూ.24,427 మేర లాభాలు అందుకున్న పరిస్థితి. అంటే.. ఒక్కో షేరు మీద రూ.800 వరకు లాభం వచ్చినట్లైంది. అంటే.. రూ.500పెట్టుబడికి రూ.800 లాభం అది కూడా ఒక్క రోజులేనే కావటం చూస్తే టాటానా మజాకానా అనుకోకుండా ఉండలేం.

లిస్టింగ్ అయిన రోజునే అత్యధిక లాభాలు అందించిన కంపెనీగా బర్నపుర్ సిమెంట్ పేరుతో రికార్డు ఉండేది. 2008 జనవరిలో లిస్టింగ్ వచ్చిన ఈ కంపెనీ షేర్ ఏకంగా 286 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యింది. కట్ చేస్తే.. లిస్టింగ్ రోజునే అత్యధిక లాభాలు పొందిన షేర్ల జాబితాలో తాజా టాటా టెక్నాలజీస్ ఏడోదిగా చెబుతున్నారు. ఏమైనా.. టాటాల మీద మదుపరులకు ఉన్న సెంటిమెంట్ మరోసారి నిజమైందని చెప్పక తప్పదు.