Begin typing your search above and press return to search.

లాభాల వర్షంతో సరికొత్త శిఖరంపై నిఫ్టీ!

నిఫ్టీ ఆల్ టైం రికార్డుగా 22,187 ను నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:25 AM GMT
లాభాల వర్షంతో సరికొత్త శిఖరంపై నిఫ్టీ!
X

సానుకూల వాతావరణం.. సెంటిమెంట్ బలంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది. వరుస లాభాలతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పలు రంగాల షేర్లు రాణించటంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు పెరిగి తన జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే.. చివర్లో చోటు చేసుకున్న సర్దుబాట్ల కారణంగా చివరకు 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు (22,122 పాయింట్లు) వద్ద స్థిరపడింది.

ఈ జోరు ఆసియాలోని మూడు.. నాలుగు మార్కెట్ల మినహా మిగిలిన చోట్ల పాజిటివ్ గానే ఉంది. హాంకాంగ్.. జపాన్.. ఇండోనేషియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోవటం గమనార్హం. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీ నష్టాల్లో జారుకున్నప్పటికీ దేశీయంగా నెలకొన్ని సానుకూల సంకేతాల ప్రభావంతో తేరుకుంది. లాభాల బాట పట్టింది.

నిఫ్టీ ఆల్ టైం రికార్డుగా 22,187 ను నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 22,122 వద్ద, సెన్సెక్స్ 72,708 వద్ద స్థిరపడింది. సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను అమ్మగా.. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బీఎస్ ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క సోమవారం రూ.2.20 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో జీవితకాల గరిష్ఠమైన రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడటం విశేషం.