Begin typing your search above and press return to search.

ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం !

ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 3:30 PM GMT
ఓడరేవులన్నీ ఆదానీ హస్తగతం !
X

దేశంలోని ఓడరేవులన్నీ దాదాపు ఆదానీ హస్తగతం అవుతున్నాయి. గుజరాత్‌ లో 4, ఆంధ్రప్రదేశ్‌ లో 2, తమిళనాడులో 2, గోవాలో 1, మహారాష్ట్రలో 1, కేరళలో 1, పుదుచ్చెరిలో 1, ఒడిషాలో 1 పోర్టు ఇప్పటి వరకు ఆదానీ గ్రూపు చేతిలో ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఓడరేవు చేరింది. వీటితో పాటు ఆదానీకి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లోనూ పోర్టులు ఉన్నాయి. మోదీ హయాంలోనే అదానీ గ్రూప్‌ అన్ని రంగాల్లో వేగంగా విస్తరించుకుంటూ పోయింది. ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్‌ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయి.

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) లిమిటెడ్‌.. కోల్‌కతాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టు కంటైనర్‌ ఫెసిలిటీ కార్యకలాపాలు, నిర్వహణ కోసం ఐదేండ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నది. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ డీల్‌ను పొందినట్టు ఏపీసెజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇప్పటికే దేశంలోని 13 పోర్టులు, టెర్మినల్స్‌ అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటిలో 45 బెర్తులున్నాయి. ముంద్రాలోగల దేశీయ తొలి పోర్ట్‌ ఆధారిత సెజ్‌, తిరువనంతపురంలోగల తొలి డీప్‌ వాటర్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ పోర్ట్‌ కూడా అదానీ చేతిలో ఉండడం గమనార్హం.

భారతదేశం తూర్పు తీరంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ డాక్‌.. అతిపెద్ద కంటైనర్‌ టెర్మినల్‌. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇక్కడ దాదాపు 0.63 మిలియన్‌ టీఈయూ (20 అడుగులకు సమానమైన యూనిట్‌) హ్యాండ్లింగ్‌ జరిగింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలతోపాటు నేపాల్‌, భూటాన్‌లకు సేవలు అందాయి. ఈ డాక్‌కు సింగపూర్‌, పోర్ట్‌ కెలాంగ్‌, కొలంబో పోర్ట్‌ హబ్‌ల నుంచి రెగ్యులర్‌ లైన్‌ సర్వీస్‌ కాల్స్‌ కూడా ఉన్నాయి.