Begin typing your search above and press return to search.

దిగ్గజ క్రీడాకారుల పెట్టుబడులు.. అజాద్ ఇంజినీరింగ్ ఇస్పెషల్

ఇటీవల కాలంలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పలువురు ప్రముఖులకు వాటాలు ఉన్న అజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ షేర్లు ఈ రోజు (గురువారం) స్టాక్ ఎక్సైంజీలో లిస్టు అయ్యాయి.

By:  Tupaki Desk   |   29 Dec 2023 2:30 AM GMT
దిగ్గజ క్రీడాకారుల పెట్టుబడులు.. అజాద్ ఇంజినీరింగ్ ఇస్పెషల్
X

సచిన్ టెండూల్కర్.. పీవీ సింధు.. సైనా నెహ్వాల్.. వీవీఎస్ లక్ష్మణ్.. నిఖత్ జరీన్ ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్గజ క్రీడాకారులే కాదు.. .ఇటీవల కాలంలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పలువురు ప్రముఖులకు వాటాలు ఉన్న అజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ షేర్లు ఈ రోజు (గురువారం) స్టాక్ ఎక్సైంజీలో లిస్టు అయ్యాయి. ఇష్యూ ధరకు ఏకంగా 35 శాతం ప్రీమియంతో అదిరేలా అరంగ్రేటం చేసింది. గత శుక్రవారం ముగిసిన అజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకు 80 రెట్లు స్పందన లభించటం తెలిసిందే. ఈ షేరు లిస్టింగ్ గురువారం జరిగింది.

అజాద్ ఇంజినీరింగ్ షేరు ఇష్యూ ధర రూ.524 అయితే.. రూ.710 వద్ద ఎంట్రీ ఇచ్చింది. కాసేపటికే పుంజుకొని రూ.720 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4219 కోట్లుగా తేలింది. ఈ ఐపీవోలో షేర్లు అలాట్ అయిన వారికి కనీసం 28 షేర్లు అలాట్ అయ్యాయి. వీరు రూ.14,672 పెట్టుబడి పెట్టగా.. లిస్టింగ్ లో పెరిగిన షేర్ ధరకు ఒక్కో లాట్ కు రూ.5488చొప్పున లాభం రావటం గమనార్హం. ఇంతమంది ప్రముఖులకు వాటాలున్న ఈ కంపెనీ ఏం చేస్తుంది? దీనికి ఎందుకంత క్రేజ్ అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

రక్షణ.. ఇంధన.. చమురు పరిశ్రమలతో పాటు ఏరో స్పేస్ తదితర రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలకు అజాద్ తమ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయటమే దీని ప్రత్యేకత. జనరల్ ఎలక్ట్రిక్.. హనీవెల్.. మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్.. సీమెన్స్ ఎనర్జీ.. .ఈటన్ ఏరో స్పేస్.. ఎంఏఎన్ ఎనరజీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు అజాద్ ఇంజనిరీంగ్ కు కస్టమర్లుగా ఉన్నారు. ఐపీవో తర్వాత లిస్టు అయిన అనంతరం పెరిగిన షేరు ధరతో సచిన్ టెండ్కూలర్ పెట్టుబడి విలువ ఏకంగా ఏడు రెట్లు పెరిగింది.

ఈ ఏడాది మార్చిలో ఆయన ఒక్కో షేరును రూ.3423 చొప్పున 14,607 షేర్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీ షేరు ముఖవిలువ రూ.10 కాస్తా దాన్ని రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించారు. అలానే అకకో షేరుకు మరో ఐదు షేర్లను బోనస్ గా ప్రకటించింది. దీంతో సచిన్ షేర్లు ఏకంగా 4.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో.. ఆయన పెట్టుబడి పెట్టిన దానికి ఒక్కో షేరు రూ.110 కాగా.. తాజాగా షేర్లు మార్కెట్ విలువ ప్రకారం రూ.32 కోట్లకు చేరటం విశేషం.

ఇలానే మిగిలిన క్రీడాకులు సైతం ఇందులో వాటాలు ఉండటం.. వారంతా తాజా లిస్టింగ్ తో భారీగా లాభపడినట్లుగా చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఈ షేరు ధర దగ్గర దగ్గర రూ.680 వద్ద ఉంది. చివరగా ఒక్క మాట... మేం చెప్పినవన్నీ మార్కెట్ లో లభించే సమాచారం ప్రకారమే. అంతే తప్పించి.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టమని కానీ.. ఇందులో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని కానీ చెప్పట్లేదు. మీ విచక్షణతో మీరు నిర్ణయం తీసుకోండి తప్పించి.. మేం సమకూర్చిన సమాచారం రిఫరెన్సుతో మాత్రం పెట్టుబడులు పెట్టకూడదన్నది మాత్రం మర్చిపోవద్దు.