Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్ కు టానిక్ గా మారిన అమెరికా ఫెడ్ రిపోర్టు.. అందులో ఏముంది?

అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా తన కీలక రిపోర్టులో ఎలాంటి రేట్లను మార్పు చేయలేదు. ఇదో సానుకూల అంశంగా మారింది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:28 AM GMT
స్టాక్ మార్కెట్ కు టానిక్ గా మారిన అమెరికా ఫెడ్ రిపోర్టు.. అందులో ఏముంది?
X

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి బుల్ దూకుడుతో సందడి వాతావరణం నెలకొంది. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ తాజాగా వెల్లడించిన రిపోర్టు.. స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. మార్కెట్ సెంటిమెంట్ ను మరింత బలోపేతం చేసేందుకు సాయం చేసింది. దీంతో భారీ లాభాల స్వీకరణకు సాధ్యమైంది. ఐటీ.. రియాల్టీ షేర్లలో కొనుగోలు మద్దతు కనిపించింది. ఈ పరిణామాలతో సెన్సెక్స్.. నిఫ్టీ సరికొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేసిందిన సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 21,150 పాయింట్లతో ముందుకు వెళ్లింది. మొదటిసారి 21వేల మార్కును దాటేసింది. తాజా దూకుడుతో మార్కెట్ మొత్తం విలువ రూ.4లక్షల కోట్లకు పెరిగింది. దీంతో.. మొత్తంస్టాక్ మార్కెట్ విలువ రూ.355 లక్షలకోట్లకు చేరుకోవటం గమనార్హం.

ఇంతకీ ఈ సానుకూల వాతావరణానికి కారణమైన అమెరికా ఫెడ్ రిపోర్టులో ఏముంది? ఏ కారణం చేత మార్కెట్ ఇంత దూకుడుగా దూసుకెళుతోందన్న విషయాల్లోకి వెళితే..

- అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా తన కీలక రిపోర్టులో ఎలాంటి రేట్లను మార్పు చేయలేదు. ఇదో సానుకూల అంశంగా మారింది.

- ద్రవ్యోల్బణం ఇంకా 2 శాతం లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నందున కటిన వైఖరిని కొనసాగిస్తే.. విధాన రేట్లను 5.25నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉంచుతున్నట్లుగా పేర్కొంది.

- వరుసగా మూడోసారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. 2024 మూడు విడతల్లో వడ్డీ రేట్ల కోతఉండొచ్చన్న సంకేతాన్ని ఇచ్చింది. దీంతో.. మార్కెట్ లో జోష్ లోకి దూసుకెళ్లింది.

ఫెడ్ రిపోర్టు పుణ్యమా అని భారత్ స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు.. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ లో షాంఘై.. నిక్కీ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు సైతం లాభపడటం గమనార్హం. మన దేశంలో టెక్ షేర్లు.. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా రాణించాయి.