Begin typing your search above and press return to search.

టాటాతో తొలిసారి డీల్ దిశగా అంబానీ అడుగులు?

టాటా.. పేరు విన్నంతనే భారతీయులంతా భావోద్వేగ బాండ్ కు ఫీల్ అవుతారు. టాటా ఉత్పత్తులను వాడే విషయంలో అస్సలు వెనుకాడరు.

By:  Tupaki Desk   |   16 Feb 2024 8:30 AM GMT
టాటాతో తొలిసారి డీల్ దిశగా అంబానీ అడుగులు?
X

టాటా.. పేరు విన్నంతనే భారతీయులంతా భావోద్వేగ బాండ్ కు ఫీల్ అవుతారు. టాటా ఉత్పత్తులను వాడే విషయంలో అస్సలు వెనుకాడరు. ఆ మాటకు వస్తే టాటా అన్నంతనే భారత బ్రాండ్ గా.. భారతీయతకు అసలుసిసలు అర్థంగా పలువురు అభిప్రాయ పడతారు. నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టాటా వ్యాపార చైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకునే విషయంలో టాటా ఎన్నో కంపెనీలకు స్ఫూర్తిగా మిగులుతుందన్న విషయంలో తెలిసిందే.

టాటా విషయం అలా ఉంచితే.. దేశంలో మరో దిగ్గజ కంపెనీ.. దేశంలో అపరకుబేరుడు అధినేతగా ఉన్న కంపెనీ రిలయన్స్ . రంగం ఏదైనా తాను ఒకసారి గురి పెడితే.. దాని సంగతి చూసే వరకు వదలని తీరు ముకేశ్ అంబానీలో కనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల మీద ఫోకస్ చేస్తున్న ఆయన.. రిలయన్స్ ను అంతకంతకూ ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఫ్యూచర్ ప్లాన్ల్స్ ను వడివడిగా అమలు చేస్తున్నారు.

అలాంటి రిలయన్స్ తాజాగా టాటాతో తొలిసారి డీల్ కుదుర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం జియోను మరింత బోలపేతం చేయటమేనని చెప్పాలి. టాటాలకు చెందిన టాటా ప్లే లో 29.8 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకిలా? అంటే దానికో లెక్క ఉంది. టాటా ప్లే వద్ద ఉన్న భారీ డిజిటల్ కంటెంట్ కారణం. టాటా ప్లేలో 28 శాతం వాటాను రిలయన్స్ చేజిక్కించుకుంటే నెట్ ఫ్లిక్స్.. అమెజాన్.. హాట్ స్టార్ లకు గట్టి పోటీ ఎదుర్కోవటం ఖాయమంటున్నారు.

టాటా ప్లే లో షేర్ల కొనుగోలు ద్వారా జియో సినిమా పరిధిని మరింత బలోపేతం చేసుకోవటానికి సాయం చేస్తుందని చెబుతున్నారు. టాటా గ్రూప్ నకు చెందిన టాటా సన్స్ కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. వీరికే కాకుండా సింగపూర్ కు చెందిన టెమా సెక్ కు టాటా ప్లే లో 20 శాతం వాటా ఉంది. టాటా ప్లే లో ఇప్పటికే తమ వాటాను అమ్మేందుకు టెమాసెక్ చర్చిస్తోంది. ఇలాంటి వేళ.. రిలయన్స్ - టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం జియో సినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించే వీలు ఉంటుంది. మరి.. రిలయన్స్ - టాటా మధ్య మొదటి డీల్ ఏమవుతుందన్నది రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుందని చెప్పాలి.