Begin typing your search above and press return to search.

ఈ సినిమాలు తెచ్చిన కలెక్షన్స్.. నిజంగా ట్రెండ్ సెట్టర్!

కంటెంట్ లో దమ్ముంటే స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 12:30 PM GMT
ఈ సినిమాలు తెచ్చిన కలెక్షన్స్.. నిజంగా ట్రెండ్ సెట్టర్!
X

ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొత్తదనం ఉన్న కథలు లేదంటే కాంటెంపరరీ స్టోరీస్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. గతంలో రొటీన్ కమర్షియల్ మూవీస్ ఎక్కువగా వస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు చిన్న హీరోలు రొటీన్ కథలని పక్కన పెట్టారు. రౌడీలతో ఫైట్స్ చేస్తేనే హీరోయిజం అనే ఆలోచనల నుంచి బయటకొచ్చారు. రౌడీలా చేతిలో చేతిలో దెబ్బలు తిన్న, హీరోయిన్ కోసం అవస్థలు పడిన, ప్రేమ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న కూడా అందులో ప్రేక్షకులు హీరోయిజం చూస్తారని అర్ధం చేసుకున్నారు.

అందుకే హీరోలు కూడా అనవసరమైన ఆర్భాటాలకు వెళ్లకుండా కంటెంట్ ని నమ్ముకొని కొత్త కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిజాన్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అందుకే లో బడ్జెట్ తో వచ్చే సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఒక జాతిరత్నాలు, బలగం, సామజవరగమన, ఓం భీం బుష్, కలర్ ఫోటో ఇలా చాలా సినిమాలు లో బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యాయి.

ఇక మీడియం రేంజ్ హీరోలలో సేఫ్ బడ్జెట్ తో వచ్చి బిగ్ స్క్రీన్ పై అత్యధిక షేర్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ గీతాగోవిందం నిలుస్తుంది. ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మూవీ ఏకంగా 68.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ నమోదు చేసింది. దీని తర్వాత సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ కేవలం 14 రోజుల్లోనే 56.65 కోట్ల షేర్ అందుకుంది.

లాంగ్ రన్ లో ఈ మూవీ గీతాగోవిందం షేర్ ని కచ్చితంగా క్రాస్ చేస్తుంది. అయితే ఏ రేంజ్ లో క్లోజింగ్ షేర్ ఉంటుందనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ నాని దసరా మూవీ ఏకంగా 54.90 కోట్ల షేర్ అందుకొని మూడో స్థానంలో నిలిచింది. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దసరా మూవీ నిలవడం విశేషం. వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పెన 52 కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది.

ఒక డెబ్యూ హీరోగా హైయెస్ట్ షేర్ అందుకున్న నటుడు అంటే వైష్ణవ్ తేజ్ అని చెప్పాలి. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన ఏ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా, హిట్ పరంగా ఆ మూవీ దరిదాపుల్లోకి వెళ్లకపోవడం విశేషం. దీనిని బట్టి కేవలం కంటెంట్ కారణంగానే ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. కంటెంట్ లో దమ్ముంటే స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.