Begin typing your search above and press return to search.

ద‌స‌రా సీజ‌న్ థియేట‌ర్ల షేరింగ్‌లో ఎవ‌రిది పై చేయి?

ఈసారి ద‌స‌రా సీజ‌న్ థియేట‌ర్ల‌కు కొత్త క‌ళ తేనుంది. ఎప్ప‌టిలాగే అగ్ర హీరోలు తెర‌పైకి దూసుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:08 AM GMT
ద‌స‌రా సీజ‌న్ థియేట‌ర్ల షేరింగ్‌లో ఎవ‌రిది పై చేయి?
X

ఈసారి ద‌స‌రా సీజ‌న్ థియేట‌ర్ల‌కు కొత్త క‌ళ తేనుంది. ఎప్ప‌టిలాగే అగ్ర హీరోలు తెర‌పైకి దూసుకొస్తున్నారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మాస్ సినిమాలు టాలీవుడ్ నుంచి దూసుకొస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన లియో అంతే క్రేజీగా తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల కానుంది. ఆస‌క్తిక‌రంగా ఇందులో బాల‌య్య న‌టిస్తున్న భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేయ‌గా.. విజ‌య్- లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ మూవీ- లియోని కూడా ఆయ‌నే పంపిణీ చేస్తున్నారు.

అయితే ఆ ఇద్ద‌రు హీరోల్లో ఎవ‌రికి మంచి ప్రైమ్ ఏరియా థియేట‌ర్లు దొరుకుతాయి? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వార‌సుడు (వారిసు -త‌మిళం) చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజుకు ద‌ళ‌ప‌తి విజ‌య్ అత్యంత ఆప్తుడిగా మార‌డంతో వార‌సుడు కోసం ప్రైమ్ లొకేష‌న్ థియేట‌ర్ల‌ను కేటాయించ‌నున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. దీనివ‌ల్ల బాల‌య్య సినిమాకి ఆశించిన థియేట‌ర్లు ల‌భిస్తాయా లేదా? అంటూ అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. కానీ భ‌గ‌వంత్ కేసరి పంపిణీ బాధ్య‌త‌లు కూడా దిల్ రాజుకే కాబ‌ట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాలి.

ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` హక్కులను ఏషియ‌న్ సునీల్ నారంగ్ దక్కించుకున్నారు. అత‌డి చిత్రానికి మంచి స్క్రీన్‌లు లభిస్తాయా లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే. దీనిపై రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ద‌స‌రా సీజ‌న్ లో పంపిణీదారులు ఇరువురూ అగ్ర‌జులే కాబ‌ట్టి థియేట‌ర్ల స‌ర్థుబాటుపై ఉత్కంఠ నెల‌కొంది.