Begin typing your search above and press return to search.

2023 టాలీవుడ్ హిట్టు బొమ్మలు.. ఇది కదా కావాల్సింది

గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది సినిమాల హిట్ రేషియో ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఏడాది మొదటి నెలల్లో టాలీవుడ్ కి చరిస్మరనీయ హిట్స్ వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 July 2023 12:19 PM GMT
2023 టాలీవుడ్ హిట్టు బొమ్మలు.. ఇది కదా కావాల్సింది
X

గతంలో టాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండేది. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది హీరోల కథల ఎంపిక కూడా మారుతోంది. కొత్తదనం ఉన్న కథలతో ప్రయాణం చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కథలని పూర్తిగా పక్కన పెట్టి కచ్చితంగా బలమైన కథ, కథనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే తెలుగులో హిట్ నెంబర్ కూడా పెరుగుతోంది.

గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది సినిమాల హిట్ రేషియో ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఏడాది మొదటి నెలల్లో టాలీవుడ్ కి చరిస్మరనీయ హిట్స్ వచ్చాయి. వాటిలో ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా నిలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ మూవీ నిర్మాతతో పాటు బయ్యర్లకి భారీ లాభాలు తీసుకొచ్చింది. దీని తర్వాత వీరసింహారెడ్డి కూడా హిట్ కేటగిరీలో చేరింది.

తరువాత చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీ రైటర్ పద్మభూషణం. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కామెడీ టచ్ తో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. తరువాత తెలుగులో ధనుష్ చేసిన మొదటి సినిమా సార్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వెంకి అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ కి సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ 2లో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దిల్ రాజు నిర్మాణంలో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన మూవీ బలగం. ఈ ఏడాది చిన్న సినిమాలలో అతి పెద్ద హిట్ గా నిలిచింది. అంతర్జాతీయ అవార్డులని సైతం ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. అలాగే విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన దాస్ కా దమ్కీ అతనికి బ్లాక్ బస్టర్ అందించింది. కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది.

ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన దసరా మూవీ ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. కొత్త దర్శకుడితో నాని సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. అలాగే విరూపాక్ష మూవీతో తేజ్ కూడా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. నిర్మాతలకు ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీని తర్వాత చిన్న సినిమాగా వచ్చి యూత్ కి కనెక్ట్ అయ్యింది మేమ్ ఫేమస్, అలాగే శ్రీవిష్ణు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా సామజవరగమన నిలిచింది. ఇప్పుడు సాయి రాజేష్ బేబీ కూడా బ్లాక్ బస్టర్ జాబితాలో చేరిందని చెప్పాలి.