Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ ఖుషి.. 2023 టాప్ ఓపెనర్లు!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోల్చుకున్న అత్యధిక విజయాలు వచ్చాయని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   3 Sep 2023 4:53 AM GMT
బాక్సాఫీస్ ఖుషి.. 2023 టాప్ ఓపెనర్లు!
X

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోల్చుకున్న అత్యధిక విజయాలు వచ్చాయని చెప్పొచ్చు. అలాగే కొన్ని సినిమాలు అయితే కలెక్షన్స్ పరంగా కొన్ని సినిమాలు ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాయి. అలాగే కొన్ని చిత్రాలు లాంగ్ రన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకొని సెన్సేషన్ హిట్స్ గా నిలిచాయి.

ఇక మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాలు చూసుకుంటే మొదటి స్థానంలో ఆదిపురుష్ ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ మొదటి రోజు అందుకుంది. అయితే సినిమా డివైడ్ టాక్ రావడంతో తరువాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. బాలయ్య బాబు వీరసింహారెడ్డి ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం 50 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.

తరువాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య మూవీ 49.5 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ డే అందుకుంది. చిరంజీవి కెరియర్ ఇదొక హైయెస్ట్ గ్రాస్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ 49 కోట్ల వరకు మొదటి రోజు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అయితే లాంగ్ రన్ లో ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీని తర్వాత నేచురల్ స్టార్ నాని దసరా మూవీ ఏకంగా 38 కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవడం విశేషం.

టైర్ 2 హీరోలలో అత్యధిక ఫస్ట్ డే గ్రాస్ సాధించిన హీరోగా దసరాతో నాని రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా లాంగ్ రన్ లో వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మెగాస్టార్ భోళా శంకర్ మూవీ ఫస్ట్ డే 29 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. దీనిని బట్టి భోళా శంకర్ సినిమాకి ముందు నుంచి పెద్ద బజ్ క్రియేట్ కాలేదని అర్ధమవుతోంది. ఆచార్య తర్వాత మెగాస్టార్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది.

తాజాగా రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ఖుషి మూవీ ఫస్ట్ డే 27 కోట్ల గ్రాస్ అందుకుంది. పాజిటివ్ టాక్ రావడంతో పాటు ముందు నుంచి బజ్ ఉండటం ఈ కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ రామ్ పోతినేని స్కంద మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది, అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలు హ్యుజ్ బజ్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఫస్ట్ డే ఏ స్థాయి కలెక్షన్స్ రాబడతాయో వేచి చూడాలి.