Begin typing your search above and press return to search.

హవ్వా.. లిప్ లాక్స్ కి 100 కోట్ల వసూళ్లా?

6 రోజుల్లోనే 91 కోట్ల వసూళ్లను అందుకుంది. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడానికి అడుగు దూరంలో ఉంది. నార్త్ అమెరికాలో $ 2 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ

By:  Tupaki Desk   |   4 April 2024 12:30 PM GMT
హవ్వా.. లిప్ లాక్స్ కి 100 కోట్ల వసూళ్లా?
X

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన “టిల్లు స్క్వేర్” చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. 6 రోజుల్లోనే 91 కోట్ల వసూళ్లను అందుకుంది. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడానికి అడుగు దూరంలో ఉంది. నార్త్ అమెరికాలో $ 2 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఈరోజో రేపో వంద కోట్ల మైలురాయి మార్క్ ను క్రాస్ చేయబోతోంది.

బ్లాక్ బస్టర్ హిట్టయిన 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా "టిల్లు స్క్వేర్" తెరకెక్కింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ లుక్, ట్రైలర్ లో అనుపమ ఎన్నడూ లేని విధంగా బోల్డ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. టిల్లుగా సిద్ధు మరోసారి క్రేజీ రైడ్ ను చూపించబోతున్నట్లు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 'అట్లుంటది మనతోని' అంటూ.. ప్రేక్షకులకు డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు.

'టిల్లు స్కేర్' హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచిపోయే సినిమా. ఇందులో ప్రధానంగా డీజే టిల్లు పాత్ర, అతని చుట్టూ అల్లుకున్న పాత్రలు, వారి మధ్య వచ్చే సంభాషణలు ఉంటాయి. ఇవే ఇప్పుడు ప్రేక్షకులు రెండు గంటల సేపు అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకునేలా చేస్తున్నాయి. టిపికల్ డైలాగ్ డెలివరీతో సిద్ధు చెప్పిన క్రేజీ డైలాగులు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు అనుపమ తన గ్లామర్ తో కట్టిపడేసింది.

అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో లిల్లీ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న స్పెషల్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ముందుగా చెప్పుకున్నట్లుగానే ఇంతకముందెన్నడూ చూడని విధంగా బోల్డ్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఎలాంటి మొహమాటం లేకుండా సిద్ధూతో కలిసి సుదీర్ఘమైన లిప్ లాక్స్ సీన్స్ లో అదరగొట్టింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు యూత్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కురిపిస్తున్నాయి.

నిజానికి 'టిల్లు స్కేర్' ప్రమోషనల్ మెటీరియల్ చూసిన తర్వాత, ఇది పెద్దలు మాత్రమే చూసే అడల్ట్ సినిమా అని అనుకున్నారు. కానీ సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇవ్వడంతో, ఈ మూవీ కంటెంట్ పై అందరి అభిప్రాయాలు మారిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా చూసి, ఇది అన్ని వర్గాల వారు చూడాల్సిన చిత్రమని చెప్పారు. ఇది అడల్ట్ కంటెంట్, యూత్ కు మాత్రమే అనుకుంటున్నారు కానీ యూనివర్సల్ గా అందరికీ నచ్చే కంటెంట్ ఉన్న సినిమా. నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అని చిరు అన్నారు.

'టిల్లు స్కేర్' మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు సంగీతం సమకూర్చగా.. భీమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. త్వరలో 'టిల్లు 3' ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.