Begin typing your search above and press return to search.

మనమే.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల షేర్ అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు లెక్క.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:19 AM GMT
మనమే.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
X

యంగ్ హీరో శర్వానంద్ మనమే ఈ రోజు థియేటర్స్ లోకి వస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ సినిమా తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సిద్ధమైంది. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. క్లీన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ తో అర్ధమైంది. ఈ రోజు రిలీజ్ అవుతోన్న సినిమాలలో మంచి బజ్ ఉన్న మూవీ అంటే మనమే అని చెప్పాలి.

శర్వానంద్ రెండేళ్ల క్రితం ఒకే ఒక జీవితం మూవీతో హిట్ అందుకున్నారు. ఆ చిత్రానికి ముందు వరుసగా ఫ్లాప్ లని శర్వానంద్ సొంతం చేసుకున్నారు. మూడేళ్ళ క్రితం శ్రీకారం సినిమా అతనికి చివరిగా వచ్చిన డిజాస్టర్. ఆ సినిమా పాజిటివ్ వైబ్ తోనే థియేటర్స్ లోకి వచ్చింది. ఏకంగా 4 కోట్ల వరకు మొదటి రోజు కలెక్షన్స్ ని సాధించింది. అయితే కంటెంట్ బాగున్న ప్రేక్షకులకి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు.

తరువాత వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా మొదటి రోజు కేవలం 75 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. హిట్ టాక్ రావడంతో తరువాత కలెక్షన్స్ పెరిగాయి. రెండేళ్ల నుంచి శర్వానంద్ సినిమాల పరంగా యాక్టివ్ లేరు. మనమే మూవీ రిలీజ్ కూడా సడెన్ గా ఎనౌన్స్ చేశారు. గతం వారం, 10 రోజుల నుంచి మాత్రమే మనమే సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది.

ట్రైలర్ కి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయిన ప్రస్తుతం ఏ మేరకు ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారనేది వేచి చూడాలి. చిత్ర యూనిట్ అయితే మొదటి రోజు 2.5 కోట్ల గ్రాస్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. నిజంగానే ఆ లెవల్ లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంటే సినిమా పబ్లిక్ లోకి స్ట్రాంగ్ గా వెళ్ళినట్లే. శ్రీరామ్ ఆదిత్య ఈ కథని రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో రియాలిటీకి దగ్గరగా ఉండేలా సిద్ధం చేశారు.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల షేర్ అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు లెక్క. ఇక ఇప్పుడు శర్వా ఆ టార్గెట్ ను ఎంత త్వరగా ఫినిష్ చేస్తాడో చూడాలి. యూత్ తో కనెక్ట్ అయ్యే లవ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో బలంగా ఉన్నాయని ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామా కూడా ఈ సినిమాలో ఉందని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోన్న మాట. మరి ఈ మూవీ ఏ స్థాయిలో పబ్లిక్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.