Begin typing your search above and press return to search.

మనమే బాక్సాఫీస్.. డోస్ పెంచుతున్న శర్వా

అంటే తొలి రోజు కన్నా రెండో రోజు 37 శాతం ఎక్కువ మంది సినిమా చూశారన్న మాట. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా ఎక్కువే రాబట్టినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:49 AM GMT
మనమే బాక్సాఫీస్.. డోస్ పెంచుతున్న శర్వా
X

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్.. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఒకే ఒక్క జీవితం మూవీతో వచ్చిన శర్వా.. ఇప్పుడ మనమే చిత్రంతో థియేటర్లో సందడి చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా.. రెండు రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయింది. బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై నిర్మించారు.

విడుదలకు ముందే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న మనమే సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ జానర్ మూవీగా మంచి టాక్ అందుకుంది. సినిమాలో శర్వానంద్ ను కొత్తగా చూసి ఆయన ఫ్యాన్స్ మురిసిపోయారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఇచ్చిన ఛార్మింగ్ స్టార్ ట్యాగ్ పెర్ఫెక్ట్ గా సూట్ అయిందని నెట్టింట కామెంట్లు పెట్టారు. కృతి శెట్టి సో బ్యూటిఫుల్ గా ఉందని తెలిపారు.

అయితే అవుట్ అండ్ అవుట్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిన మనమే.. తొలిరోజు మంచి వసూళ్లు సాధించి సత్తా చాటింది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రముఖ ఆన్ లైన్ టికెట్ సెల్లింగ్ యాప్ బుక్ మై షోలో అందులో మనమే సినిమా టికెట్స్ తొలి రోజు 55 వేలకు పైగా అమ్ముడయ్యాయి. ఇప్పుడు రెండో రోజు.. ఫస్ట్ డేకి మించి సేల్ అయ్యాయి. 67 వేలకు పైగా టికెట్లను కొనుగోలు చేశారు సినీ ప్రియులు.

అంటే తొలి రోజు కన్నా రెండో రోజు 37 శాతం ఎక్కువ మంది సినిమా చూశారన్న మాట. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా ఎక్కువే రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే వీకెండ్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఫీల్ గుడ్ జానర్ మూవీ కనుక ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీక్ డేస్ లో ఇదే జోరు కొనసాగితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా కంప్లీట్ చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.

స్టోరీ లైన్ ఇదే..

లండన్ లో చదువుకుని హీరో ఫుల్ చిల్ అవుతుంటాడు. అయితే హీరో ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ అనుకోకుండా ఓ ప్రమాదంలో అతడి భార్య మరణిస్తుంది. దీంతో వాళ్ల కొడుకు బాధ్యతలను హీరో తీసుకుంటాడు. హీరోయిన్ కూడా హీరోకు హెల్ప్ చేస్తుంది. అప్పటికే ఆమెకు ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. అయినా హీరో, బాబును తన ఇంట్లోనే ఉంచుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరోయిన్ కు కాబోయే భర్త ఏమన్నాడు? హీరో హీరోయిన్లు.. బాబు కోసం ఒక్కటయ్యారా? అనేది మిగతా సినిమా.