Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ లో టాప్ బాక్సాఫీస్ హిట్స్ ఇవే..

ఇక ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన టాప్ టెన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే...

By:  Tupaki Desk   |   15 July 2023 12:49 PM GMT
రీ రిలీజ్ లో టాప్ బాక్సాఫీస్ హిట్స్ ఇవే..
X

కొన్ని సినిమాలకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు బోర్ కొట్టవు అనే విధంగా ఉంటాయి. అయితే వెండితెరపై చూసేందుకు కూడా మరోసారి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు అని ఇటీవల కాలంలో చాలాసార్లు రుజువు అయింది. స్టార్స్ క్రేజ్ ఎలా ఉంటుందో రీ రిలీజ్ కలెక్షన్స్ తో చాలా క్లారిటీగా అర్థమవుతోంది. ఇక ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన టాప్ టెన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే...

మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ క్లాసిక్ లవ్ స్టోరీ ఖుషి ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల కంటే అత్యధికంగా 7.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సినిమా రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. భవిష్యత్తులో బ్రేక్ చేయడం కూడా అంత ఈజి కాదని అర్ధమవుతోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి 4k వెర్షన్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమా 4.60 కోట్లు సాధించింది. ఇక ఊహించని విధంగా పెద్దగా స్టార్ కాస్ట్ లేని ఈ నగరానికి ఏమైంది సినిమా బాక్సాఫీస్ వద్ద రెండోసారి కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ముఖ్యంగా మొదటిసారి కంటే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసింది. మొత్తంగా ఈ సినిమా రీ రిలీజ్ లో 3.52 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

ఇక మరొక డిఫరెంట్ లవ్ స్టోరీ 'ఆరెంజ్' కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఈ సినిమా రెండోసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద 3.36 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

ఆ మొత్తాన్ని జనసేన పార్టీ చేస్తున్న మంచి పనులకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ మరొక సారి ఈ రికార్డులో 'జల్సా' సినిమాతో స్థానం సంపాదించుకున్నాడు. జల్సా సినిమా రీ రిలీజ్ లో 3.20 కోట్లను అందుకుంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఒక్కడు 4K' రీ రిలీజ్ అయినప్పుడు 2.54 అందుకుంది. ఇక ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన పోకిరి రీ రిలీజ్ లో 1.73 కోట్లను సాధించింది. ఇక 'దేశముదురు 4K' సినిమా 1.65 కోట్లు, తొలిప్రేమ 1.52 కోట్లు, చెన్నకేశవరెడ్డి 1. 10 కోట్లు, బిల్లా సినిమా 1.05 కోట్లతో తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.