Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో పవన్ బ్లాస్టింగ్.. ఏడు రికార్డులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బ్రో. ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   30 July 2023 12:09 PM GMT
ఓవర్సీస్ లో పవన్ బ్లాస్టింగ్.. ఏడు రికార్డులు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బ్రో. ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానుల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రెగ్యులర్ ఆడియన్స్ నుంచి మాత్రం పర్వాలేదని మాట వినిపిస్తోంది. ఈ వీకెండ్ పూర్తయితే సినిమా ఏ స్థాయిలో నిలబడే అవకాశం ఉందనేది తెలిసే ఛాన్స్ ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. టైం రెప్లికేట్ గా ఉండే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి లైఫ్ ఎలా మారింది అనేది ఈ చిత్రంలో కథాంశంగా ఉంటుంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 50 కోట్లకి పైగా గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో రెండు రోజుల్లోనే వన్ మిలియన్ గ్రాస్ ని అందుకుంది. ఇలా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు ఏడు సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరాయి. మొదటి రోజు 850కె కలెక్షన్స్ ని బ్రో మూవీ అందుకుంది. రెండో రోజు 200 కె కలెక్షన్స్ వచ్చాయి. దీంతో వన్ మిలియన్ టార్గెట్ ని దాటిపోయింది.

ఇప్పటి వరకు అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సర్ధార్ గబ్బర్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ సినిమాలు వన్ మిలియన్ క్లబ్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో బ్రో మూవీ కూడా వచ్చి చేరడం విశేషం. విదేశాలలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదే స్థాయిలో నిలకడగా మూవీ రన్ కొనసాగితే మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశం ఉంటుంది. వంద కోట్ల మార్క్ ని టచ్ చేయాలన్నా కూడా మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ కెరియర్ బ్రో మూవీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.